పుట:ప్రబోధచంద్రోదయము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లనియు సభవారిచేతనే చెప్పించుట జరిగినది. ఇట్లు కవిపేరు చెప్పుట నాటకప్రస్తావనపద్దతి.

కృతిపతి వంశవివరములు

గంగమంత్రి పూసపాటి మాధవవర్మ వంశీయుడైన బసవభూపాలునియెుద్ద మంత్రిగా నుండెడివాడు.

సీ.

మాధవవర్మ భూమండలేశ్వరు వంశ
                          జలధికి నేరాజు చందమామ
యేరా జుదయశైల మెలమిని భేదించెఁ
                          గపటాహితమదాంధకార మడఁగ
గజపతి సురధాణి గడిదుర్గముల కెల్ల
                          నే రాజు వజ్రంపుబోరుతల్పు
మహిమచే నేరాజు మఱపించె నల భగీ
                          రథపృథుమాంధాతృరఘురమణుల


గీ.

నట్టి గుణశాలి తమ్మరాయనికుమార
వీరబసవక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

గంగమంత్రియేగాక అతనికి ప్రభువైన యీ బసవరాజును కవిపోషకుడు. ఈతడు నెల్లూరిమండలమున ఉదయగిరి రాజ్యమున కధిపతియై ఉదయగిరిలో నుండువాడు. దూబగుంట నారాయణకవి తన పంచతంత్రమను కృతిని నీ బసవరాజునకే అంకితము గావించెను. గంగమంత్రి బసవరాజు మంత్రి గావున నాతడు ఉదయగిరి వాస్తవ్యుడై యుండెనని మనము గ్రహింపవచ్చును.

వంశ విశిష్టత

ఈ గంగమంత్రి ఆర్వేలనియోగిశాఖీయుడు. కాశ్యపగోత్రుడు. ఈగ్రంథమున నాతడు "పెసరవాయాన్వవాయ" అని సంబోధింపబడుటచేత నీతని