పుట:ప్రబోధచంద్రోదయము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నంది సింగన - వామనపురాణము[1]
క.

కాంతాలలామ ని న్నే
కాంతంబునఁ బల్కరింతుఁ గల్గిన కార్యం
బెంతయు ముద మలర విను
మంతట నీమదికిఁ దెలివిడై యుండు జుమీ!

(3-175)


గీ.

సరసచిత్రాన్నములును రసాయనములు
భక్ష్యములు నూఱుఁబిండ్లును చాలుజున్ను

(3-172)

ఇందు రెండు పాదములే యుదాహరింపబడినవి.

నంది సింగన - బలరామవిజయము

క్షత్రియధర్మంబున మాం
ధాత్రుఁడు రాజ్యంబు నీతిఁ దగఁ బాలించెన్
శాత్రవరహితంబుగ నిజ
గోత్రము వెలయంగఁ బ్రజలు గొనియాడంగన్.

(3-71)


ఇక కవులషష్టమునుండి మదనసేనమునుండి లభ్యమైన పద్యములను

ననుబంధములో నిచ్చియున్నాను.

  1. తెలుగున వామన పురాణరచయితలలో- నందిసింగన మొదటివాడు. తరువాత
    1. లింగమగుంట రామకవి - క్రీ శ. 1550
    2. ఎలకూచి బాలసరస్వతి - క్రీ.శ. 1600 (అలభ్యము)
    3. పోన్నతోట ఔబళకవి - క్రీ.శ. 1650 (లభ్యము)
    వామనపురాణము నాంధ్రీకరించిరి.