పుట:ప్రబోధచంద్రోదయము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తమగండ గండరగండ; గండభేరుండ సరస్వతీమనోభండార చూఱకాఱ బిరుదాంకిత రాదయేఱువసింహసనాధీశ్వర శ్రీమత్కాశ్యపగోత్రద శ్రీమన్మహామండలేశ్వర చికతిమ్మయదేవ మహాఅరసుగళ కొమారరు తిమ్మరాజగళు తొట్టు ధర్మశాసనద క్రమవెంతంతెందెరే శ్రీరామచంద్రదేవర అమృతపడిగె శ్రీ వీర కృష్ణరాయ మహారాయరు సమర్పిస్త సొండూరు సీమె వొళిగణ తాళూరగ్రామదలు ఇత్యాది.[1]

దీనివలన తిమ్మరాజు క్రీ.శ. 1521-1522లో యేఱువసీమకు నాయకుడుగా నున్నట్లు స్పష్టము. ఇది కృష్ణదేవరాయల కాలము.[2]

పై వివరములనుబట్టి వీరిగ్రంథరచనాక్రమ మీరీతిగా నిర్ణయింపవచ్చును:

1. ప్రబోధచంద్రోదయము — క్రీ.శ. 1470-80 ప్రాంతము
2. వరాహపురాణము — క్రీ.శ. 1480-90 ప్రాంతము
3. కవులషష్ఠము — క్రీ.శ. 1500-1510 ప్రాంతము

ఇందువలన నందిమల్లయ ఘంటసింగయ కవులు క్రీ.శ. 1450 క్రీ.శ. 1520 మధ్యప్రాంతమున జీవించియుండిరని మనము నిశ్చయింపవచ్చును.

ఇతరేతర గ్రంథములు

వీరిరువురు వేర్వేఱుగా గ్రంథరచన చేసినట్లు ప్రబంధరత్నావళియను సంకలన గ్రంథమువలన తెలియుచున్నది. అందు నందిమల్లయ మదనసేనము అనుకావ్యమునుండి నాలుగు పద్యము లుదాహరింపబడినవి.

నందిమల్లయతండ్రి సింగన “సారస్వతాభినంది' కదా— ఆతడు వామనపురాణమును, బలరామవిజయమును రచించెను. ఆగ్రంథములలోని పద్యములు ఆనందరంగరాట్ఛందమున నుదాహరింపబడినవి.

  1. శృంగారషష్ఠము. డా. నేలటూరి వెంకటరమణయ్య. కిన్నెర, జూలై 1953, పుటలు 531-588
  2. శృంగారషష్ఠము. డా. నేలటూరి వెంకటరమణయ్య. కిన్నెర, జూలై 1953, పుటలు 531-588