పుట:ప్రబోధచంద్రోదయము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్యములుకొన్ని సింగనకృతిలో చేరకపోలేదు. అదెట్లు జరిగినదో చెప్పుట కష్టము. షష్ఠస్కంధకవులు ఇంచుమించు సమకాలీనులు. కవులషష్ఠమని బహువచనరూపము చెప్పబడుటచే నీగ్రంథము నందిమల్లయ, ఘంటసింగయ్యలదే యని చెప్పవచ్చును.

ఈగ్రంథము లభ్యముకాలేదు. కాని యిందలి మొదటిపద్యము ఆడిదము సూరన తన కవిసంశయవిచ్ఛేదము అను లక్షణగ్రంథమున నుదాహరించినాడు.

శ్రీరామామణి సీతనాథుని యురస్సీమన్ నిజచ్చాయఁ గ
న్నారం గన్గొని యాత్మ నన్యవని తేర్ష్యం బూనఁ దత్కంధరన్
హారం బున్పుచు నింకఁ జూడు మన దానౌటం ద్రపం జెందఁ జె
ల్వారున్ రాముఁడు బ్రోఁచుఁగాత చికతిమ్మాధీశు తిమ్మాధిపున్”

(1-99)

గణపవరపు వేంకటకవి, కవులషష్ఠము - అని ఆంధ్రప్రయోగరత్నాకరమున తిమ్మయతనూజుడు తిమ్మరాజని చికశబ్దము లేకుండనే వాడియున్నాడు.

చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూజా తిమ్మ! విధ్వస్తపా
షండంబైన త్రిలింగ భాగవత షష్ఠస్కంధ భాగంబు నీ
కుం డక్కెన్ జతురాననత్వగుణ యుక్తుల్ మీఱ వాణి మనో
ఖాండారోద్ధతి చూఱకార బిరుద ప్రఖ్యాతిసార్థంబుగాన్.

ఇందువలన చికతిమ్మరాజునకు తిమ్మరాజను పేరున్నట్లు స్పష్టము.

ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో (1-84) పైవద్యములోని రెండు మూడు పాదము లుదాహరింపబడినవి.

కవులషష్ఠము కృతిపొందిన తిమ్మరాజు క్రీ.శ 1521 సంవత్సరమున నున్నట్లుగా నీక్రింది కన్నడశాసనము తెలుపుచున్నది.

తిమ్మరాజు శాసనము

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంగళు 1443 నైయ విక్రమ సంవత్సరద మాషుశు 7 లూ శ్రీమతు రామచంద్ర వీరభాండారతె