పుట:ప్రబోధచంద్రోదయము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతికర్త యైన శ్రీనాథుని బిలిపించి సముచితాసనమున కూర్చుండ నియమించి యచట్చనున్న వీరభద్రారెడ్డి యన్నయగు వేమారెడ్డి 'ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ మంకితము సేయు వీరభద్రయ్యపేర” అని శ్రీనాథునికి కర్పూరతాంబూలసహితజంబూనదాంబరాభరణంబు లిచ్చి చెప్పించికొన్నాడు. ఈ విధముగా ప్రఖ్యాతులైనకవులు గ్రంథరచన కుపక్రమించుటయు, నద్దానిని రాజులు విని యంకితము బుచ్చుకొనుటయు జరుగుచుండును.

సాళ్వతుళువాన్వయముల సంధికాలమున బుట్టిన ఈ గ్రంథము చరిత్రకారుల కత్యంతము విలువైనది. బ్రౌను, సీతారామాచార్యులవారు వారినిఘంటువులయందు నీ జంటకవుల గ్రంథములను గ్రహించినట్లు కానరాదు. వీరేశలింగంపంతులుగారి దయవలన నీ రెండు గ్రంథములు సూర్యాలోకమును బడసినవి. టేకుమళ్ళ అచ్చుతరావుగా రీగ్రంథముపై చక్కనివిమర్శ వ్రాసిరి[1]. రాయలవారికాలమున హరిభట్టు వరాహపురాణము నాంధ్రీకరించెను[2]. ఈ వరాహపురాణద్వయతులనాత్మకసమీక్ష రెండు గ్రంథములు లభ్యములైననాడుగాని చేయుటకు వీలుండదు.

వరాహపురాణము చారిత్రకముగానేగాక సాంఘికముగా గూడవిలువైనది.

కవులషష్టము

కవులషష్ఠ మనియు, శృంగారషష్ట మనియు దీనిని లాక్షణికులు పేర్కొనిరి. ఆంధ్రభాగవతమున పోతన షష్ఠస్కంధము నాంధ్రీకరించలేదు. ఏర్చూరిసింగన హరిభట్టు, సర్వన, రాచమల్లుకవులు (వీరిదే కవులషష్ఠమను నష్టప్రాయమైన గ్రంథము) షష్ఠస్కంధము నాంధ్రీకరించిరి. కాని ఈ షష్ఠస్కంధములలో

ఏర్చూరి సింగన కృతమైన గ్రంథమే ఆంధ్రభాగవతమునందు కుదురుకొన్నది. తాళపత్రయిలందును నట్లేకలదు. అయినను హరిభట్టు కృతషష్ఠస్కంధములోని

  1. చూ. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయము, ప్రధమభాగము
  2. హరిభట్టు వరాహపురాణమును డాక్టరు దేవరకొండ చిన్నికృష్ణశర్మగారు (రాజధాని కళాశాల-మద్రాసు0 పరిష్కరించి, అచ్చొత్తించిరి.