పుట:ప్రబోధచంద్రోదయము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"తదనంతరంబ కృతిపతికిం బతిమైన సాళువనరసింగరాజ రాజమౌళి పావనాన్వయంబు మొదల వర్ణింతము" (1-20)

"అట్టి (సాళ్వ) నరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున (1-24)"

ఈ నరసరాజు మండువా, బెడద, మాహురాది దుర్గములు జయించెనని యీకృతియందు గలదు. నందితిమ్మన పారిజాతపహరణమున నింకను మఱికొన్నివిజయములను సాధించెనని నరసరాజును వర్ణించినాడు. ఇవి యన్నియు సాళ్వ నరసింగరాయల కొఱకేయని విజయనగరచరిత్రకారు లేకగ్రీవముగా నంగీకరించియున్నారు.

వరాహపురాణము క్రీ.శ. 1490 ప్రాంతమున రచింపబడియుండవచ్చును.

"వరాహపురాణము క్రీ.శ.1490 సంవత్సరమునకు పూర్వమునను-క్రీ.శ. 1485 సంవత్సరమునకు బిమ్మటను రచియింపబడియె" ననుట నిశ్చయము అని శేషయ్యగారు వ్రాసినారు.[1]

ద్వాదశాశ్వాస పరిమితమైన నీగ్రంథము కృష్ణరాయలవారితండ్రి తుళువ నరసనాయకున కంకిత మీయబడినది. కృతిస్వీకారము నాటికి నరసరాజు సాళ్వనరసింగరాయలయొద్ద సైన్యనాయకుడు. దీనిని కృతిపతి కోరికపై వీరు రచించలేదు. ఈజంటకవుల "కృతిప్రారంభమును కర్ణాకర్ణికావశంబున" నరసరాజు విని వీరిని పిలిపించి

"కావున మీరు దలంచిన
శ్రీవారాహంబు మంచికృతి మా పేరం
గావింపుఁ డనుచు"

(1-14)

కప్పురము వీడ్యము నిచ్చి కృతి తనపేర వెలయించుకొన్నాడు. ఇట్లే కాశికాఖండరచనాప్రారంభమును వీరభద్రారెడ్డి కర్ణాకర్ణికావశంబున వినియే తత్

  1. ఆంధ్రకవి తరంగిణి - పూర్వోక్తము పుట 133