పుట:ప్రబోధచంద్రోదయము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండును—క్రీ.శ.1370 ప్రాంతమున ప్రబోధచంద్రోదయము నీకవులు రచించియుందురు"[1]

ఇచట శేషయ్యగారు శతాబ్దము నిచ్చుటలో పొరబడినారు. పురుషోత్తమగజపతి క్రీ.శ. 1466 మొదలు 1496 వఱకు పాలించినాడు. 1467 ప్రాంతమున గజపతి పట్టుకొని యుండును. క్రీ.శ. 1470 ప్రాంతమున ప్రబోధచంద్రోదయము నీకవులు రచించి యుందురు అని యుండవలెను.

గజపతితో నరసింగరాయలు విడివడి సంధి చేసుకొనుటకు గంగమంత్రి సహాయము చేసిన విషయమును పురస్కరించుకొని నందిమల్లయ ఘంటసింగయ కవులు పైరీతిని చెప్పియుందురు. ఈ సంఘటన క్రీ.శ. 1468లో జరిగినది. ఇది యైన మఱికొన్నియేండ్లకు ప్రబోధచంద్రోదయరచన జరిగియుండవలెను. అది సుమారు క్రీ శ. 1470 ప్రాంతము, ప్రబోధచంద్రోదయరచనాకాల మిది యని చెప్పవచ్చును - తక్కిన కృతులు వరాహపురాణము, కవులషష్ఠము రెండును ప్రబోధచంద్రోదయము తరువాతివి. కావున వీరి రచనలలో ప్రబోధచంద్రోదయము మొదటిది.

వరాహపురాణము

వరాహపురాణము తుళువనరసరాజున కంకిత మీయబడినది. ఈ తుళువనరసరాజు సాళువవంశీయుల వెనుక విజయనగరరాజ్యమును - క్రీ. శ. 1493 మొదలు క్రీ. శ. 1505 వఱకు పాలించెను. కావున వరాహపురాణము క్రీ శ. 1490-1500 మధ్య రచితము కావలెను. కృతిపతి తుళువ నరసరాజు విజయనగరసామ్రాజ్యము పరిపాలించిన సాళ్వ నరసింగరాయల దండనాయకుడు. ఈవిషయము వరాహపురాణమునం దిట్లు చెప్పబడినది.

"నరసింహ నృపాల దండనాయకతిలకా”

(11–1)
  1. ఆంధ్రకవితరంగిణి 6వ సంపుటము - నందిమల్లయ ఘంటసింగయ కవులు, పుట 145.