పుట:ప్రబోధచంద్రోదయము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదికావ్యము. ఇది ఒక్క వాల్మీకిరామాయణమునకు మాత్రమే చెల్లును. రామాయణము పేరితో నున్న తక్కినవాని కిది చెల్లదు. ఇంతకు వాసిష్ఠరామాయణము (ఇదియు మడికి సింగనదే)నకు, అసలు రామాయణమునకు సంబంధము లేదు. మడికి సింగన రచించినది జ్ఞానవాసిష్ఠ రామాయణము వేదాంతగ్రంథము.

16. ప్రబోధచంద్రోదయము. సంస్కృత నాటకమునకు ననువాదమగుచుండగా నిది పురాణముగా నెట్లు పరిగణింపబడినదో దురూహ్యము.

పైయైదింటిలో వరాహపురాణము, పద్మపురాణము, భాగవతము మాత్రమే పురాణములు

పురాణాంతర్గతకథలను ప్రబంధములుగా చెప్పుట

2.1. శృంగారశాకుంతలము : శృంగారశాకుంతలమున భారతకథ ప్రస్తావన యుండుటచేతను, భారతము పురాణమను నూహతోను, ఈ భాగములో చేర్చినారు పీఠికారచయితలు. శృంగారశాకుంతలమంతయు భారతకథనే తూచాతప్పక పూర్తిగా ననుసరించిన నిందుచేర్చుట సమంజసమే కాని, పినవీరభద్రకవియే

"భారతప్రోక్త కథ మూలకారణముగ
కాళిదాసుని నాటక క్రమముకొంత" (1-27)

అని స్పష్టముగా కాళిదాసుని నాటకక్రమమునుగూడ ననుసరించినట్లు చెప్పుటచేతను పేరు "శాకుంతలము" అని పెట్టుటయు నిది నాటకానువాదముక్రిందవచ్చును. కేవల భారతకథయే యైన పినవీరన దీనికి "శకుంతలోపాఖ్యానము" అని పేరు పెట్టునుగాని శాకుంతలమని పెట్టడు. ఇది నాటకానువాదమని విమర్శకుల యభిప్రాయము.[1] భారతము పురాణముకాదు.

  1. విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాఙ్మయ చరిత్రము - పిల్లలమఱ్ఱి పినవీరన - శృంగారశాకుంతలము పుట 167 టేకుమళ్ల అచ్యుతరావు (1933)