పుట:ప్రబోధచంద్రోదయము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. హరవిలాసము. ఇది యేకైకముగా నొకపురాణమునుండి గ్రహింపబడినకథలు కలదికాదు. కథాకావ్యము.

1,2 ఆశ్వాసములు చిఱుతొండనంబి కథ బసవపురాణములో నున్నది. కాని బసవపురాణము మనపురాణముల వంటిది కాదు.
3, 4 ఆశ్వాసములు గౌరీకల్యాణము కాళిదాసు కుమారసంభవమున కనువాదము.
5వ ఆశ్వాసము ఈశ్వరలింగావిర్భావము.
6వ ఆశ్వాసము హాలాహల భక్షణము.
7వ ఆశ్వాసము కిరాతార్జునీయము (ఇది నన్నయ కిరాతార్జున కథాభాగమునకు నకలు.)

3, 4. కాశీఖండ భీమఖండములు (భీమఖండ కాశీఖండములని క్రమము) స్కాందపురాణాంతర్గతములు కాని ఇందు భీమఖండము మూలము శ్రీనాథునిదిగాని వ్యాసునిది కాదని నిర్ణయింపబడినది.[1]

5. నైషధీయచరితమను శ్రీహర్షునికావ్యమునకు ననువాదము.

6. నాచికేతూపాఖ్యానము. దీనిని పురాణాంతర్గతకథగా చేర్చినారు. దీనికి కరోపనిషత్తు మూలము. భారతమున నీకథ కలదు. దగ్గుపల్లి దుగ్గన తెలుగుకృతికి మూలము సంస్కృతములో నున్న నాసికేతచరితమను కావ్యము.[2]

కావున నీవిభాగములో చెప్పదగినవి రెండే - భీమఖండము, కాశీఖండము. సంస్కృతనాటకానువాదములు అని యొకవిభాగము చేసి అందు

1. క్రీడాభిరామము
2. శృంగారశాకుంతలము
3. ప్రబోధచంద్రోదయము

చూపిన సమంజసముగా నుండెడిది.

  1. శ్రీనాథుడు. డాక్టరు కొర్లపాటి శ్రీరామమూర్తిగారి సిద్ధాంతగ్రంథము. (పుటలు 287-424)
  2. విజయనగరసామ్రాజ్యమునందలి ఆంధ్రవాఙ్మయము పుట 185.