పుట:ప్రబోధచంద్రోదయము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యుగమునందలి కావ్యములన్నిటిని మూడు విభాగములు చేయవచ్చును.

1. పురాణములను పరివర్తించుట:-

1 వరాహవురాణము 4 భాగవతదశమస్కంధము
2 జైమినిభారతము 5 వాసిష్ఠరామాయణము
3 పద్మపురాణోత్తరఖండము 6 ప్రబోధచంద్రోదయము

2. పురాణాంతర్గతకథలను ప్రబంధములుగా చెప్పుట:-

1 శృంగారశాకుంతలము 4 భీమఖండము
2 హరవిలాసము 5 శృంగారనైషధము
3 కాశీఖండము 6 నాచికేతూపాఖ్యానము

3 వివిధకథలను గూర్చి యేకకావ్యముగా రచించుట:-

1 విక్రమార్కచరిత్ర 3 సింహాసనద్వాత్రింశిక
2 భోజరాజీయము 4 పంచతంత్రము

అని యున్నది. దీనికి కొంతవిమర్శన యావశ్యకము.

2. జైమినిభారతము. ఇది పురాణపరివర్తనము కాదు. సంస్కృతమున భారతము ఇతిహాసము గాని పురాణముకాదు.

(జనమేజయుండు ...... నివ్వినుతేతిహాసంబు విని భార. స్వర్గా. 79)

.

4. భాగవతదశమస్కంధము. సంస్కృతమున భాగవతము పురాణము. శ్రీనాథయుగమున వెలసి ఆబాలగోపాల మెఱిగిన పోతన భాగవతమును విడిచి ఒక్క దశమస్కంధము మాత్రమే యెట్లు పేర్కొనబడినదో తెలియుటలేదు.

మడికి సింగన భాగవతదశమస్కంధము ద్విపద యున్నది. ఇది పద్మపురాణోత్తరఖండ కృతికర్తయైన మడికి సింగనదే. భాగవతదశమస్కంధము పైద్విపదకృతి యనుకొనవలెను.

5. వాసిష్ఠరామాయణము. రామాయణము తెలుగువారి వ్యవహారమును బట్టి పురాణము కావచ్చును కాని సంస్కృతమున నది కావ్యము. ప్రథమకావ్యము