పుట:ప్రబోధచంద్రోదయము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యు లక్షణములు సామాన్యముగా నుండుటచే వేఱుగా నాటకములు వ్రాయునవసరము లేకపోయినది.”

కాని యింతకంటె బలవత్తరమైన కారణము నా కీసందర్భమున పొడగట్టుచున్నది. అది సంస్కృతనాటకము లందున్న

భాషావైవిధ్యము - ప్రాకృతము

సంస్కృతనాటకములలో సంస్కృతభాషయే ప్రధానమైనను అందు ప్రాకృతభాషలకు స్థానము గలదు. అందు ఉత్తమపాత్రలకు సంస్కృతమును మధ్యమాధమ లేక నీచపాత్రలకు ప్రాకృతభాషయు నుపయోగింపబడును. ఆపాకృతమైనను నొకటికాదు. ఆరు విధములైన ప్రాకృతములు వాడబడును. శ్రీనాథుడు, కొఱవి గోపరాజు వంటివారు మన పూర్వకవులలో కొందరు సంస్కృత, ప్రాకృతభాషానిష్ణాతులు, కావున యీ భాషావైవిధ్యములమూలననే పూర్వకాలమున సంస్కృతనాటకములు యథామాతృకముగా గద్యపద్యాత్మికముగా తెలుగులోనికి ననూదితములు కాలేదని గ్రహింపవలసియున్నది. ప్రాచీనకవులు ప్రబంధరీతినే యనువదించిరి. అట్టివానిలో మొదటిది.

కేయూరబాహుచరిత్రము (క్రీ.శ. 1300)

ఇది మంచెనకవి ప్రణీతము క్రీ.శ. 1300 ప్రాంతము నాటిది. ఇది సంస్కృతమున రాజశేఖరమహాకవి రచించిన “విద్ధసాలభంజిక” అనునాటికకు తెలుగు. నాటికలో నాలుగంకములే యుండును. గాన నిందు నాల్గశ్వాసములే కలవు. నాటికాకథాక్రమము ననుసరించిన దయ్యు నిందు, నిరువదిరెండు నీతికథలు సంధర్భానుసారముగా చొప్పింపబడినవి. ఇట్లున్నను కావ్యము రసవంతముగా చేయు నేర్పు మంచెనయం దంచితముగా గలదు. దీనికి సుసంస్కృతముద్రణము రావలసియున్నది.

క్రీడాభిరామము (క్రీ.శ. 1430)

ఇది రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతభాషలో రచించిన "ప్రేమాభిరామము" అను నాటకమునకు తెలుగు. ఇది దశరూపకములలో 'వీథి' అను