పుట:ప్రబోధచంద్రోదయము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వివిధమహిమలఁ దనరు నావిమలసరసిఁ
జూచి నివ్వెఱవడి రాజసూనుఁ డపుడు.

(342)


సీ.

మెఱుఁగుశృంగములందు మెదలక యున్నవి
                          నీలమేఘంబులు నీరజాస్య!
వెన్నెలపులుగులు వేకువ చంద్రువైఁ
                          దేలుచన్నవి చూడు తియ్యఁబోఁడి!
మింట నాగడపలు మెల్లమెల్లగ విచ్చి
                          కానరావయ్యెనో కలువకంటి!
పారిజాతపుదీగ బహువర్ణపుష్పభా
                          రంబు మోవఁగలేదు కంబుకంఠి!


గీ.

ననుచుఁ దమలోన గర్భోక్తు లాడుకొనుచుఁ
దనకు నుపచారములు సేయు ననుఁగుజెలులఁ
జూచి నవ్వుచు సహజన్య చూడనొప్పెఁ
జారుదోహదలక్షణసహితయగుచు

(343)[1]

సంస్కృతనాటకములు - ప్రబంధానువాదములు

పూర్వకవులు సంస్కృతవాటకములను ప్రబంధములుగా ననువదించుటకు హేతువు “ఆంధ్రనాటకములు - రంగస్థలములు" అను గ్రంథమున నిట్లుగలదు.[2]

“మనప్రబంధములు సంస్కృతనాటకములకును సంస్కృతకావ్యములకును మధ్యవర్తులు. వీనియందు నాటకములయొక్కయు కావ్యములయొక్క

  1. ప్రబంధరత్నావళి వేటూరి ప్రభాకరశాస్త్రి ద్వితీయ ముద్రణము 1976. పుటలు 72,78. ఇందు ప్రస్తుత గ్రంథపరిష్కర్త పీఠిక కలదు.
  2. టేకుమళ్ల అచ్యుతరావు. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర పుట 168-169