పుట:ప్రబోధచంద్రోదయము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుసరణలు

తెలుగున ప్రబోధచంద్రోదయ నాటక మవతరించిన వెనుక, అట్టిదే మఱియొకకావ్యము తెలుగున వెలసినది. దాని పేరు జగన్నాటకము.

ఇది ప్రబోధచంద్రోదయమువలె సంస్కృత నాటకానువాదముకాదు. తెలుగు ప్రబోధచంద్రోదయము ననుసరించిన స్వతంత్రకావ్యము.

ఈకావ్యకర్త ఏదుట్ల శేషాచలుడు.[1] ఇతడు తెలంగాణ ప్రాంతమువాడు. కృత్యాదియం దీతడు చేసిన కవిస్తుతిలో పింగళి సూరన కడపటివాడు గావున నీతడు క్రీ.శ. 1700 ప్రాంతమున నుండియుండును.

ప్రబోధచంద్రోదయమువలె నిదియు నైదాశ్వాసముల పద్యకావ్యము. ఈకావ్య మముద్రితమగుటచేత ఇందుగల యాశ్వాసములందలి విషయములను వివరించుచున్నాను.

ఇందు మొదటి రెండాశ్వాసములకన్న తరువాతి మూడాశ్వాసములలోను నీ నాటకకథ హెచ్చుగా నున్నది.

ప్రథమాశ్వాసము

సత్స్వరూపంబైన పరబ్రహ్మంబునందు, జీవప్రకృత్యాదిజననంబును నతండు వినోదార్థంబుగా భరతశాస్త్రానురూపాధ్యాత్మవిద్యానుసారంబుగా త్రివిధాండంబులు బుట్టి వికసించిన తద్భూతత్రిశక్తి త్రిమూర్తు లన్యోన్యపరిగ్రహసామర్థ్యంబున నాట్యసామాజికసంపత్తి పరబ్రహ్మనిర్దేశంబున నిరూపితులై నిలుచుటయు తత్పరమేశ్వరుండు సభాసదనంబు గల్పించి పేరోలగం

  1. మఱుగుపడిన మాణిక్యాలు. డాక్టరు బి. రామరాజు ఏదుట్ల శేషాచలుడు - గోలకొండ పత్రికా ప్రచురణ 1961 ఈ శీర్షికయందలి విషయములన్నియు నిందుండి గ్రహింపబడినవి పైగ్రంథకర్తకు కృతజ్ఞుడను.