పుట:ప్రబోధచంద్రోదయము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బున్న సమయంబున మార్దంగికాది సామాజికజనంబు నతనిం బ్రశంసించుటయు బుద్ధివిదూషకుడు మనస్సూత్రధారి యనునుతంబున విప్రమాతృకాగమనసూచనము చేయుటయు ననునవి గలవు.

ద్వితీయాశ్వాసము

విప్రమాతృకాగమంబును ఆయ (...)ంబు వాచికాభినయంబుల జెప్ప(—) దను గమ్యమానులైన విప్రులు వేదశ్రోతజ్యోతిషసాముద్రికశకునస్వప్నసాహిత్యవైద్యాదివిద్యలు ప్రసంగించుటయు క ( ) దాచ్చా ఆంగికాభినయంబును ( ) తత్పురోభాగమున చతురంగబలసమేతులై రాజమంత్రులు చనుదెంచుటయు తమతమ...టయు... నాట్యాభినయంబు చూపుటయు మాగధులు స్తోత్రంబులు చేయుటయు వైశ్యమాతృక యేతెంచి యాహార్యంబున నభినయించుటయు తద్వ్యవహారగోత్రమాతులకన్యావివాహనిర్ణయంబును శూద్రమాతృక చనుదెంచి సాత్వికంబున నభినయించి వర్ణభేదంబు దెలుపుటయు సకలశక్తిప్రకారంబు సేయుటయు ననునవి గలవు.

తృతీయాశ్వాసము

మహాకావ్యంబునందు అహంకారుండు మమకారియను భార్యసమేతుండై వచ్చితనప్రభావంబు వక్కాణించుటయు, మోహుం డేతెంచి తనస్థితిని జెప్పుటయు కామాగమనంబును రతివర్ణనంబును లోభుండు తృష్ణ యను పత్నితోడం గూడి చనుదెంచి తననడక చెప్పుటయు క్రోధుండు హింసయను మహిషీసమేతంబుగా మదమత్సరులం గూడి వచ్చి తనప్రభావంబు రూపించుటయు గాణాపత్య, సత్య, బౌద్ధ, జైన, చార్వాక, శాక్తేయు లేతెంచి తమస్థితులు వచించటయు శైవ, వైష్ణవ సంవాదంబుచే యుద్ధం బగుటయు సుమతియని సాధ్విసహితంబుగా వివేకు డరుదెంచి కలహంబు మాన్చుటయు ననునవి గలవు.

చతుర్థాశ్వాసము

ద్వైతవిశిష్టాద్వైతు లేతెంచి, భేద భేదాభేద భేదంబుచేత బ్రహ్మస్వరూపంబు నిరూపించుట యనునవి గలవు.