Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మస్తు మోదో౽స్తు కల్యాణమస్తు
విభవో౽స్తు [1]సస్యాభివృద్ధిరస్తు నమో౽స్తు
              దానలీలాస్తు సత్కాంతిరస్తు


తే.

ధనకనకవస్తువాహనధాన్య[పుత్త్ర
పౌత్త్ర]లాభో౽స్తు నిత్యసౌభాగ్యమస్తు
ప్రతిభటౌఘక్షయో౽స్తు భూపాలనైక
శక్తిరస్తు సదైవ తే జనవరేణ్య!

38

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము

సీ.

శ్రీసిద్ధిరస్తు శాసితవైరిమండల
              విజయో౭స్తు భువనైకవీరవర్య!
అభ్యుదయో౭స్తు సాహసబలసామగ్ర్య!
              కల్యాణమస్తు నిష్కలుషహృదయ!
శుభమస్తు కారుణ్యవిభవసముజ్జ్వల!
              బ్రహ్మాయురస్తు భూపాలతిలక!
యభివృద్ధిరస్తు మహౌదార్యభూషణ!
              చిరకీర్తిరస్తు భాసుర[2]గుణాఢ్య!


తే.

తుష్టిరస్తు నిజాంకనిర్ధూతకలుష!
[3]పుష్టిరస్తు జగత్త్రయీపూరచరిత!
భద్రమస్తు మహీభారభరణ! నీకు
నధికతేజో౭స్తు తే నిషధరాజ!

39

నీరాజనము

ప్రౌఢకవి మల్లన – రుక్మాంగదచరితము [4-11]

సీ.

పద్మరాగనవీనపాత్రికాప్రభలకుఁ
              గరనఖద్యు[తులు] శృంగార మొసఁగఁ
దిన్ననై విలసిల్లు దీపదీప్తులకును
              గలికి కన్నుల డాలు చెలు వొనర్ప
ఘనసారవర్తికాకలితగంధమునకుఁ
              దనుసౌరభంబు మోదంబు సేయ
మధురమంగళగీతమహితనాదములకుఁ
              గలకంకణధ్వనుల్ గరిమ యిడఁగ

  1. క.సైన్య
  2. చ.గణాఢ్య
  3. క.వృష్ణి