Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత

సీ.

శుభమస్తు వైభవప్రభుగుణసంభవ
              శ్లాఘాపరాభూతశక్ర! నీకు
భద్రమస్తు సముద్రముద్రితక్ష్మాభార
              భరణకద్రూసుతప్రౌఢ! నీకు
విజయో౽స్తు నిష్ఠురనిజభుజాసముదగ్ర
              విక్రమక్రమకళావిజయ! నీకు
కల్యాణమస్తు సత్కవిరాజసంకల్ప
              కల్పనా[1]కల్పనాకల్ప నీకు


తే.

నాయురస్తు తుషారనీహారహార
ధాళధళ్యప్రధామలధవళకీర్తి
సాంద్రచంద్రాంతపక్లాంతశత్రురాజ!
విరహిణీలోకహృదయారవింద నీకు.

36

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-17]

సీ.

స్వస్త్యస్తు శశివంశజలధికౌస్తుభరత్న
              శ్రీరస్తు సమర[నిర్జితసపత్న
దీర్ఘా]యురస్తు పృథ్వీజనస్తుత[శీల
              కల్యాణ]మస్తు విక్రమవిశాల
ఐశ్వర్యమస్తు ధర్మానోకహస్కంధ
              సమధికోన్నతిరస్తు సత్యసంధ
సౌభాగ్యమస్తు సజ్జనచూతవనచైత్ర
              విశ్వతోవిజయో౽స్తు విమతజైత్ర


తే.

భూవినుతకీర్తిరస్తు సత్పుత్త్రపౌత్త్ర
సంపదభివృద్ధిరస్తు విశ్వప్రశస్త
శక్రవిభవో౽స్తు పూరువంశప్రదీప
జగతి[2]భవత శ్చిరాయ దుష్యంతభూప!

37

ప్రౌఢకవిమల్లన – రుక్మాంగద చరిత్ర [1-81]

సీ.

ఆరోగ్యమస్తు దీర్ఘాయురస్తు యశో౽స్తు
              శ్రీరస్తు సంకల్పసిద్ధిరస్తు
హరిభక్తిరస్తు సుస్థిరతాస్తు మహిమాస్తు
              విప్రప్రసాదో౽స్తు విక్రమో౽స్తు
విఖ్యాతిరస్తు [దిగ్విజయో౽స్తు సామ్రాజ్య]

  1. క.కల్పక
  2. క.భవతాంచితాయ