Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మెఱుగుఁ జెక్కుల కాంతులు నెఱయఁ బర్వి
వజ్రతాటంకరుచులకు వన్నె వెట్ట
వారిజానన లపుడు నివ్వాళు లొసఁగి
రమ్మహీపాలునకుఁ బ్రయత్నమ్ము లలర.

40

మల్లికార్జునభట్టు - బాలకాండ [712]

చ.

నలి నెదురేఁగుదెంచి యెలనాగలు దాఁచిన కక్షదీధితుల్
వెలువడఁ బయ్యెదల్ వెడల వీఁకఁ గుచంబులు నిక్క దీపికా
కళికలు నోష్ఠరాగములు కాంతుల నీనఁగ లేఁతకౌనుదీఁ
గలు వణకాడ బాహులతికల్ నిగుడించి [1]నివాళు లియ్యఁగన్.

41

ముక్కు తిమ్మయ్య – పారిజాతము [2-13]

క.

కలికి [2]నిడువాలుఁ గన్నుల
తళుకులు మణిదీపశిఖలుఁ దడబడ లక్ష్మీ
నిలయున కిచ్చిరి కొందఱు
నెలఁతలు మౌక్తికవిచిత్రనీరాజనముల్‌.

42

పేరయ్య - మంగళగిరివిలాసము

ఉ.

హారతు లిచ్చు వే + యిన నారికి[?] రాయనిఁ గన్నతండ్రి కొ
య్యారి మెఱుంగుఁ జూపులనె హారతు లిచ్చె నొకర్తు తజ్ఝణా
త్కారకరద్వయీవలయకాంతులు గుత్తపుఁ జన్నుదోయి తా
హారగళంచలన్నలు + జాలత నెంతకురయన్ భాకాంతిమై[?].

43

ఛప్పన్నదేశాలు

తులసి బసవయ్య - సావిత్రికథ

సీ.

సౌవీర మగధ కోసల భోసల పుళింద
              [3]లాట కేరళ మహాఘోట [4]భోట
సాముద్ర [5]పౌండ్ర ఘూర్జర కుంత లావంతి
              పాండ్య గాంధార నేపాళ గౌళ
కర్ణాటక కురు కేకయ వత్స మత్స్యాంగ
              బంగాళ సింధు కళింగ వంగ
[6]కుకురు బాహ్లీకాది కొంకణ తెంకణ
              సాళ్వ కాశ్మీర పాంచాల చోళ

  1. క.నివాళి సేయగన్
  2. క.నివాళి కనుంగవ
  3. క.హాట
  4. చ.చోట
  5. క.పాండ్ర
  6. చ.కురుబాహ్లికా[?]ది