Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరుమూరి [1]గంగరాజు - కుశలవోపాఖ్యానము

సీ.

పదపద్మరజమునఁ బాషాణపుత్త్రికఁ
              బూఁబోణిఁ జేసిన పుణ్యుఁ డితఁడు
బాలుఁడై హరధనుర్భంగంబు సీతకు
              నుంకువ సేయు నిశ్శంకుఁ డితఁడు
మణిమయంబై యున్న మాయాకురంగంబుఁ
              గడఁగి చంపిన వేటకాఁ డితండు
కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు
              బాణాగ్రమున నిల్పు [2]ప్రౌఢుఁ డితఁడు


తే.

ప్రబలదశకంఠపటుకంఠనిబిడవిపిన
దహనకీలాయమానదోర్దండచండ
చటులకోదండనిర్ముక్తశరనికాయుఁ
డితఁడు కాకుత్స్థవంశాబ్ధిహిమకరుండు.

7

తులసి బసవయ్య – సావిత్రికథ

సీ.

తనశాతహేతి మత్తవిరోధిశుద్ధాంత
              దుర్దాంతహృద[3]యాగ్నిధూమరేఖ
తనకీర్తి హుతవహస్తంభశంభుకిరీటి
              [4]తక్షుల్లమల్లికాస్తబకపంక్తి
తననిరర్గళదానధార పంకజభవాం
              డోదంచితా[5]వరణోద[6]కంబు
తనభుజంబు పయోనిధానవేష్ఠితవిశ్వ
              వసుమతిధేనుకావైణకంబు


తే.

గాఁగ విలసిల్లు సకలదిక్చక్రవాళ
భరితతేజో[7]నివహబృహద్భానుదళిత
చండభానుండు సంతతాఖండవిభవ
శాలి యగు నశ్వసేనభూపాలవరుఁడు.

8

[8]సంకుసాల సింగన్న - కవికర్ణరసాయనము [1-27]

సీ.

తనభూభరణదక్షతకు మెచ్చి ఫణిరాజు
              చులుకన యగు వేయితలలు నూపఁ
దనఖడ్గపుత్త్రి శాత్రవుల నచ్చరలను
              జిన్నిబొమ్మలపెండ్లి చేసి యాడఁ
దనమూర్తి సుందరతాగర్వవతు[లైన

  1. ఉదాహరణపద్యములు
  2. క.ప్రౌఢ
  3. క.యాజ్ఞి
  4. క.తచ్ఛుల్ల
  5. క.వరుణ
  6. యంబు
  7. చ.నిహహబృహద్భానుదళిత
  8. సుంకెసాల