|
సతులమానసములఁ] బ్రతిఫలింపఁ
దనకీర్తి వల్లికాతతుల కాశావధి
కుంభిదంతముల [1]వే గొనలు గాఁగఁ
|
|
తే. |
బ్రస్తుతికి నెక్కె సతతధారాళనైజ
దానచిరవాసనావాసితప్రపంచ
రంజనైకమహారాజకుం[జరంబు
విశ్వభూభర్త]యై యువనాశ్వవిభుఁడు.
| 9
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-87]
సీ. |
విశ్వసన్నుతశాశ్వతైశ్వర్యపర్యాయ
కుటిలకుండలిరాజకుండలుండు
దిగిభశుండాదండదీర్ఘ[2]బాహాదండ
మాని[తాఖిలమహీమండలుం]డు
జనసన్నుతానన్యసామాన్యవైభవ
శ్లాఘాకలితపాకశాసనుండు
కులశిలోచ్చయసానుకోణస్థలన్యస్త
[3]శస్తవిక్రమజయశాసనుండు
|
|
తే. |
భాసమానమనీషాంబుజాననుండు
[సకలదేశావనీపాలమకు]టనూత్న
రత్నరారజ్యదంఘ్రినీరజయుగుండు
శంబరారాతి[4]నిభుఁడు దుష్యంతవిభుఁడు.
| 10
|
సీ. |
ప్రకటప్రతాపాతపముచేత వైరుల
కన్నులఁ జీకట్లు గ్రమ్మఁజేసి
[ఖడ్గహాలాహల]గరిమచే నహితుల
నమృతాశనులు గాఁగ నలవరించి
సలలితసత్కీర్తిచంద్రికఁ బగతుర
మనసుల దాహంబు మట్టుకొల్పి
సముదగ్రధారాళశరవృష్టి విమతుల
తనువులఁ జమ[టలు దలము కొ]ల్పి
|
|
తే. |
చిత్రచారిత్రవిక్రమశ్రీ వహించి
సాహసాంకమహీపాలచక్రవర్తి
|
|
- ↑ క.ముల్ కొనలు
- ↑ క.వాహా
- ↑ క.శస్త్ర
- ↑ క.విభుఁడు