Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వినుతి సే[యం]గఁ దగు [యుద్ధ][1]విజయ[2]లటహ
పటహనిర్గుణనిర్ఘాతపటలచటుల
ఘోరనిర్ఘోషవినమితకుమతవిమత
కులకరన్యస్తవిస్తృతానలుఁడు నలుఁడు.

4


సీ.

శాత్రవభుజగభుజంగమశాత్రవ
              శాత్రవనృపబలసాగరముల
రిపుపద్మవనపద్మరిపు[3]రిపుప్రళయధా
              త్రీనాథపురవరత్రిపురములను
విద్విష్టగిరిగిరివిద్విష్టవిద్విష్ట
              మండలాధీశభూమండలముల
వైరికైరవవనవైరికైరవవన[వైరి]
              వైరిభూపాలకాంతారములను


ఆ.

బొం గణంపఁ ద్రుంపఁ బొరిమార్ప గాల్ప నౌ
ర్వానలుండు, నలుండు, వృషాంకబాణ
పటుతరానలుండు ప్రళయానలుండు ద
వానలుండు ధరణి నా నలుండు.

5

[వాసిరాజు రామయ్య – బృహన్నారదీయము][4]

సీ.

విశ్వంభరాచక్రవిజయలక్ష్మీఘన
              స్తన[5]పరీరంభదోస్స్తంభయుతుఁడు
బాడబానలశిఖా[6]భంగిభానుప్రభా
              ద్యోతమానప్రతాపోజ్జ్వలుండు
కుండలీశాధీశగురుపద్మసంభవ
              స్ఫుటశేముషీకళాభూషణుండు
సురసింధుశరదభ్రశుభ్రాభ్రకాదభ్ర
              విభ్రమస్థిరయశోవిశ్రుతుండు


తే.

విపులకోదండనిర్ముక్తవిశిఖనివహ
దారుణోదగ్రదహనదందహ్యమాన
సమదశాత్రవరాజన్యచటులవిపిన
సముదయుండు భగీరథక్ష్మావరుండు.

6
  1. చ.దనుజ
  2. క.పటహ
  3. క.రిష
  4. ఉదాహరణపద్యములు
  5. క.పరి
  6. చ.భంగ