పోతరాజు భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-269]
చ. |
వెసఁ గదలించి హో యనిన [1]వ్రేల్మిడిలోనన నిల్చుఁ గంధరం
[2]బుసుమక బిట్టదల్చినను [3]భోరన సాగరమైన దాఁటు బ
ల్వసమున [4]ఱాఁగలన్ దఱిమి వాగె వదల్చిన [5]జువ్వనం జవం
బెసఁగఁగ గాలి మీఱుఁ బురి నెన్నిక కెక్కిన [6]కత్తులాణముల్.
| 283
|
(భాస్కరరామాయణము) బాలకాండ [1-30]
చ. |
జవమున [7]భంజళిన్ మురళిఁ జౌకమునన్ [8]నడ నైదుధారలన్
వివిధవిచిత్రవల్గము వివేకములన్ బొలపంబునన్ శుభ
ధ్రువముల దూరభారముల రూపబలంబుల రూఢి కెక్కి యా
హవజయశీలముల్ గలుగు నశ్వము లెన్నఁగఁ బెక్కు లప్పురిన్.
| 284
|
తులసి బసవయ్య - సావిత్రికథ
క. |
హరితురగము నరుణాంశుని
హరులుం గవగూడెనేని యగు సరిలేదా
సరి గావని యితరహయో
త్కరములన నగు నప్పురమునఁ గల హరులెల్లన్.
| 285
|
పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము
తే. |
పట్టువడ [9]కతిచపలతఁ బాఱె మనసు
సూరిజననుత! రూపఱి సుడిసె గాలి
యండ గొనె నారిగట్టియై యాశుగంబు
లప్పురము గుఱ్ఱముల వేగ మరసిచూడ.
| 286
|
వీరభటులు
భాస్కరరామాయణము - బాలకాండ [1-32]
చ. |
కులగిరి లెత్తనైన వడిఁ గుంభిని గ్రుంగఁగఁ [10]ద్రొక్కనైన వా
ర్ధులఁ గలపంగనైన జముఁ దుప్పలు దూలఁగఁ దోలనైన ది
గ్వలయమదేభకుంభములు వ్రక్కలు సేయఁగనైనఁ జాలు దో
ర్బలముల గెల్తు రాజిఁ బరిపంథుల నందుల వీరసద్భటుల్.
| 287
|
- ↑ క.వేలెటి
- ↑ క.బిసుమక
- ↑ క.వేగమె
- ↑ క.వాగలన్
- ↑ క.నొప్పునాననం
- ↑ క.ఖత్తులాణముల్
- ↑ క.భంజిణిన్
- ↑ క.మదజీర
- ↑ ట.కది
- ↑ క.దావ