|
భరతాభినయముల నిరపేక్షగా లోక
దృష్టులు దనియ నర్తింపకుండ
|
|
తే. |
రయముచేఁ జిత్తగతుల గెల్చియును బతుల
మతులలో ననువర్తింప మాకు వలసె
ననుచు సిగ్గున దలవంచుకొనిన విటులొ
యనఁగఁ [1]దగి యొప్పుఁ బురి నుత్తమాశ్వతతులు.
| 279
|
పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
కమనీయచిత్రసంగతగతిక్రమముల
దిగ్గజాదుల నడ ధిక్కరించి
లాలితగంభీరలఘుతరప్లుతముల
హరిణసంఘంబుల నపహసించి
సవ్యాపసవ్యసంచరణమహోద్ధతిఁ
బంచాననక్రీడ [2]బాహు సఱిచి
మహితనిరాయాసమధ్యాజవంబుల
ననిలప్రయాణంబు లతకరించి
|
|
తే. |
సముచితాన్వర్థపూర్ణవేగములచేతఁ
గెరలి వచ్చి తలంపులఁ గిక్కురించి
హేతి మాడ్కి నుప్పరముల నెసక మెసఁగి
పంచధారలు గల హయపంక్తు లడరు.
| 280
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-52]
చ. |
బిసరుహబంధుఁ గొండచఱిఁ బెట్టుట యొండెఁ బయోధి నీటిలో
మసలక వైచు టొండె నడుమ న్నిలఁబెట్టఁగ రాదు వాగె వె
క్కసములు మాకు నెందు సరిగావుసుమీ యని యాడుచుండు సం
తసమున భానురథ్యములఁ దత్పురితుంగతురంగసంఘముల్.
| 281
|
తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము
ఉ. |
చంగున దాఁటు ధేయనిన సప్తసముద్రములైన వేగ వా
గెం గుదియింప నిల్చు [3]నడిగెంటనె శస్త్రనిపాతధీరతన్
సంగరరంగవీథిఁ దమ స్వామికి గెల్పు ఘటించునట్టియు
త్తుంగతరంగరత్నములు తొంటి హయాకృతిశార్ఙి పుట్టువుల్.
| 282
|
- ↑ క.పని
- ↑ క.పాడి చెఱచి
- ↑ ట.నడు