Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బమ్మెర పోతరాజు - దశమస్కంధము [10-1-1608]

క.⁠

పులులపగిదిఁ గంఠీరవ
ములక్రియ శరభములమాడ్కి ముదితమదేభం
బుల[1]తెఱగున నానావిధ
కలహ[2]మహోద్భటులు భటులు గల రా వీటన్.

⁠ 288

[3]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము (1-12)

క.⁠

ప్రతివర్షంబును ధర ను
ద్ధతిఁ బడియెడి పిడుగులెల్లఁ దగఁ గూర్చిన రా
కృతులుగ నిర్మించెనొకో
శతధృతి యన వీట సుభటసంఘము వొలుచున్.

⁠ 289

తులసి బసవయ్య - సావిత్రికథ

క.⁠

బీరమునఁ బొదలి సమర
ప్రారంభమె పెండ్లి యనుచు బల[4]వర్గమునన్
వైరులకు వెన్ను చూపని
శూరవ్రజ మప్పురమునఁ జూడఁగ [5]నమరున్.

⁠ 290

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

(పెదపాటి సోమరాజు)

క.⁠

తఱుము దురంతకునైనను
వెఱచఱువఁగ భద్రకరుల విఱుతురు హరి ను
క్కఱఁ బట్టి చట్ట లేరుదు
రుఱుకుదు [6]1రుగ్రాగ్నినైన నురుభటు లందున్.

⁠ 291

పిల్లలమఱి వీరయ్య – శాకుంతలము [1-79]

క.⁠

సంగరము లేక యుండిన
సింగంబులఁ బులుల సమదసింధురముల నే
కాంగిఁ దొడరి పడవైతురు
పొంగునఁ దమ కుబుసుపోక [7]పురవీరభటుల్.

⁠ 292


మ.⁠

విమలశ్రీపదపద్మజ ... ముఖావిర్భూతనానావిధో
త్తమభవ్యస్తుతిపాత్ర! పాత్రగురుపుత్త్రానంద నందానదా

⁠
  1. ↑ క.తీరున
  2. ↑ క.మదో
  3. ↑ సుంకసాల
  4. ↑ ట.వర్షమునన్
  5. ↑ ట.నొప్పున్
  6. ↑ యుగాగ్నికైన
  7. ↑ క.పురి