Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [1-71]

సీ.

శృంగారరసమునఁ [1]జికిలి సేయించిన
              కంతు మోహనసాయకంబు లనఁగ
మెఱసి [2]పోకను నిల్చి [3]మెలఁతలై కనుపట్టు
              కారుక్రొమ్మెఱుఁగుల గము లనంగ
వరరూపలావణ్యవైభవశ్రీమూర్తు
              లన మించు నవకల్పలత లనంగ
మురిపెంపు నడలచే గరువంబు దళుకొత్తు
              పసమించు రాయంచ పదువు లనఁగ


తే.

జిత్తజునితేరి కలికిరాచిలుక లనఁగఁ
గాంతిఁ జూపట్టు నవచంద్రకళ లనంగ
మగల నెలయించు మరుని దీమంబు లనఁగ
వారసతు లుందు రప్పురము నందు.

219

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

సీ.

తమచూపు లొగిఁ బాంధతతులపైఁ బూనిన
              భావజు కరవాలభాతు లనఁగఁ
దమకురుల్ యువమృగేంద్రములకై తీర్చిన
              మరు నసమానంపుటురు లనంగఁ
దమహాసములు విటోత్కరమానములఁ బట్టు
              వలరాజు పువ్వులవల లనంగఁ
దమకాంతి పురుషులఁ దాపంబు నొందించు
              రతిరాజు మోహనరస మనంగ


తే.

జలజకాహళకదళికాపులినగగన
కోకబిసశంఖ[4]చంద్రాళికులముఁ దెగడు
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు
బాహుగళవక్త్రకచముల పణ్యసతులు.

220

పిల్లలమఱ్ఱి వీరయ్య - శాకుంతలము [1-82]

సీ.

హరినీలరుచుల నీలాలకంబులు గావు
              చిత్తజు మధుపశింజినిలు గాని
క్రొన్నెలవంక లాగుల భ్రూలతలు గావు
              విషమాస్త్రు తియ్యనివిండ్లు గాని
యలసంబులైన వాలారుఁ జూపులు గావు

  1. క.జిలికి
  2. క.పోవక
  3. క.మెలుకలై
  4. క.చంద్రాది