Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరయ్య - శాకుంతలము [1-83]

చ.

వెలకుఁ దగం బ్రసూనములు వేఁడుచు మార్వలికింప నెత్తులం
గలసి చిగుళ్ళు వెట్టి యడకట్టిన క్రొవ్విరిమొల్లపూవుటె
త్తులు దశనాధరద్యుతులఁ దోఁచినఁ బైకొన ఠీవిగా విటుల్
విలువఁగ వారిచిత్తములు విల్తురు తత్పురి పుష్పలావికల్.

215

జక్కన - సాహసాంకము [1-83]

ఉ.

[1]ఎత్తుల యొప్పుకంటె [2]సర మెత్తుట యొప్పఁగఁ జొక్కి విల్వకా
[3]ఱొత్తడిఁ బుష్పముల్ గొనర కూరక యున్కికి [4]నల్ల నవ్వుచున్
విత్తముతోన చిత్తములు వేగ హరింతురు నేర్పు మీఱఁగాఁ
జిత్తజువేఁట దిమ్మరులు బెల్వునఁ దత్పురిపుష్పలావికల్.

216

[5]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

క.

మెత్తని బంగరు రవరవ
లొత్తెడు కరమూలరోచు చొలయం[6]గాఁ దా
రెత్తులు గట్టెడు మిషమున
జిత్తినితన మెల్ల బయలుసేయుదు రచటన్.

217

వారస్త్రీలు

[7]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-20]

సీ.

గమనంబులే చాలుఁ గన్నులు దనియింప
              నృత్యంబు లేలొకో నేర్చి రిట్లు
పలుకులే చాలు వీనులకుఁ బండువు సేయ
              నెఱపాట లేలొకో నేర్చి రిట్లు
సౌందర్యములె చాలు సమ్మోహనమునకునై
              నేపథ్య మేలొకో నేర్చి రిట్లు
తారుణ్యములె చాలుఁ దలఁపులు గరఁగింప
              నెఱతనం బేలొకో నేర్చి రిట్లు


తే.

లిది ప్రియాతిరేక మిదిగదా నఖముఖ
సాధ్యమునకుఁ బరశుసంగ్రహంబు
వీరు గలుగ [8]మరుఁడు విజయి గాఁ డెట్లన
వఱలుదురు పురంబు వారసతులు.

218
  1. క.వామ
  2. క.గర
  3. క.రొత్తిలి
  4. క.యట్ల
  5. ఫణిదపు
  6. ట.గను
  7. సుంకెసాల
  8. క.నరుఁడు