Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాతమన్యవశిలాస్థగితకాంచీధామ
              భాసురోపవనాళిపరివృతంబు
పౌరప్రతాపవిభ్రాంతికృత్కుట్టిమ
              స్థలశోణమణిరుచిస్థపుటితంబు


తే.

బహువిధామోదమోదితభసలకలభ
విసరవిసృమరఝంకారవేణునినద
సరసగాయకగానరసప్రసంగ
సౌఖ్యతర మగునావంచికాఖ్యపురము.

132

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-69]

సీ.

పద్మరాగోపల ప్రాకారరుచిజాల
              గండూషితవ్యోమమండలంబు
పాతాళజల[1]ఝరీపర్యాప్తకల్లోల
              సుకుమారపరి[2]ఖోప[3]శోభితంబు
[4]శక్రనీలశిలావిశాలగోపురరోచి
              రసమయజనితమిథ్యాతమంబు
కనకగోపానసీఖచితముక్తాఫల
              రాజివిలగ్నతారాగణంబు


తే.

రాజసదనాగ్రదేశవిరాజమాన
తోరణాలీనమణిగణద్యుతివితాన
విభవలక్ష్మీవిడంబితవిలసదింద్ర
చాపరుచిచాపలము హస్తినాపురంబు.

133

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ - మల్హణకథ [1-33]

సీ.

కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుఁ
              బంకజీవనపరిప్లవము గాక
ఘనసారపున్నాగకమనీయ మయ్యును
              గితవ[5]దుష్కనకసంయుతము గాక
సాధుదానప్రౌఢియూధపం బయ్యును
              విశ్రుత[6]ఖరసమన్వితము గాక
రాజితోత్తమజాతిరత్నాంకితం బయ్యు
              శృంగార[7]కూటదూషితము గాక


తే.

వరసరోవరచయమును వనచయంబు
నృపచయంబును దివ్యమంటపచయంబు
నెలమిఁ దనుఁబోలు నను పొగడ్తలు వహించె
భువనసారంబు కల్యాణపురవరంబు.

134
  1. క.చరి
  2. క.ఘోష
  3. క.శోణి
  4. క.శక్రానిల
  5. క.దుష్కలిత
  6. క.ఖల
  7. క.విటవి