Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోటవర్ణన

ఆదిపర్వము

చ.

పరిఘజలంబులం దమరు పంకరుతహ్పోలకైతవాదిసుం
దరకుసుమంబులన్ ఘనపదంబున నుజ్జ్వలతారకానిరం
తరకుసుమంబుల న్వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా
శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్.

135

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-71]

మ.

దివిఁ బ్రాకారము ముట్టియుండఁగఁ దదుద్దేశంబునం గోటతో
దవులుం జక్రమ నిక్కమంచుఁ బురిమీఁదన్ రాక పార్శ్వంబులం
గవనుంద్రోవ ననూరుయత్నమున రాఁగా [1]నౌటఁగాఁబోలు బో
రవితే రుత్తరదక్షిణాయనములం బ్రాపించి దీపించుటల్.

136


క.

పురికొల్పు రత్నదీప్తుల
నరుణములై చుక్కలుండ నంగారకునిన్
బరికించి యిందుఁ దెలియక
కరము విచారింతు రెంత కార్తాంతికులున్.

137

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

క.

కోటతుద మకరప్రభ
దీటుగొనం బర్వి పరులదృష్టికి నొప్పున్
బాటించి మేయ దివి రవి
ఘోటకముల కజుఁడు పసురు కొలిపినభంగిన్.

138

[2]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-3]

క.

పట్టణరమ బిరుదునకై
పట్టిన పగలింటి దివియ దాగునఁ గోటన్
జుట్టును దన్మణిగణరుచి
ఘట్టితతేజమునఁ దిరుగు ఖరకరుఁ డెపుడున్.

139

బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1594]

క.

కోటయు మిన్నును దమలోఁ
బాటికి జగడింప నడ్డవడి నిల్చిన వా

  1. క.జాలు
  2. సుంకసాల