తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
హరినీలరుచిరమధ్యప్రభా[1]యోగంబు
నంభోదరశ్రేణి నపహసింప
శశికాంతకుట్టిమచ్ఛాయాకలాపంబు
వరబలాకావైభవమ్ము నెఱప
నంగనాచటులకటాక్షపాతంబులు
సౌదామనీవిలాసములు సేయ
నిబిడభేరీశంఖనినదసంరంభంబు
ఘనగర్జితప్రౌఢిఁ గైకొనంగఁ
|
|
తే. |
గలహవిగళితసౌధాగ్రగతవధూటి
కాప్రసూనాళికరకా[2]ప్రకాస్తిఁ బెనుప
మహిమ నే ప్రొద్దు వర్షాగమంబు ఠేవ
దీపితం బయ్యె భోగవతీపురంబు.
| 130
|
జక్కన - సాహసాంకము [7-133]
సీ. |
శ్రీకవితానూనచిత్రరేఖాయుక్తి
కొమ్మలందును గోటకొమ్మలందు
నవరసపదవృత్తనానార్థగరిమలు
రాజులందును గవిరాజులందుఁ
గరలోకసంతోషకరజీవనస్థితి
సరసులందును గేలిసరసులందు
నవనవ[3]శ్రీసుమనఃప్రవాళవిభూతి
మావులందును నెలమావులందుఁ
|
|
తే. |
గలిగి సముదగ్రసౌధాగ్రతలసమగ్ర
శాతకుంభమహాకుంభజాతగుంభి
తోరురత్నవినూత్నశృంగార మగుచు
[4]సిరుల నొప్పారు విక్రమసింహపురము.
| 131
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [1-7]
సీ. |
సౌధచరద్వధూజనదర్పణీభవ
ద్ద్వివ్యలోకస్రవంతీజలంబు
రజతవప్రస్థాణుగజచర్మశాటీభ
వత్పరిఘావారివలయితంబు
|
|
- ↑ ట.భోగంబు
- ↑ క.ప్రశస్తి
- ↑ క.రోచమాన
- ↑ క.విరుల