|
నట్టి రాజమహేంద్రుని యనుఁగు మనుమఁ
డెనఁగుఁ జాళుక్యవిశ్వేశ్వరుండు.
| 127
|
[1]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [1-2]
సీ. |
జాతరూపమనోజ్ఞజాతరూపంబైన
కోటచే వలయాద్రి నోటుపఱిచి
మధుసుధారసపూర [2]మధు[ర]నీరంబైన
పరిఘచే వారాశి భంగపఱిచి
నవరత్నచిత్రాభినవయత్నకములైన
యిండ్లచేఁ గనకాద్రి యేఁపు గఱిచి
కాంతనిర్మలచంద్రకాంతబద్ధములైన
కుట్టిమంబుల ధాత్రి గొంచె పఱిచి
|
|
తే. |
కమలగర్భుండు దనసృష్టి గాని భువన
కోశదుర్గంబు నణగింపఁగోరి దీని
వేడ్క నిర్మించెననఁ బొల్చు విమతహృదయ
[3]ఘట్టనంబైన సాకేతపట్టణంబు.
| 128
|
తెనాలి రామలింగన్న - హరిలీలావిలాసము
సీ. |
వినుతమాణిక్యవందనమాలికాకాండ
కల్పితరోహితాకారరేఖ
జాలకానననిర్యదాలోలవాసనా
గరుధూపపోషితకంధరాళి
చంద్రశాలాతిగర్జన్మృదంగధ్వాన
విరచితపవిఘోషవిభవలహరి
సంభోగసంరంభసమయవిచ్ఛిన్నము
క్తాహారమణికృతకనకనికర
|
|
తే. |
మదనమదభారమంథరమత్తకాశి
నీ దృగంచలసంచితనిబిడచంచ
లాలతాతల్లజయు [4]నై యిలావివిక్త
వర్ష యన నొప్పు కాకుత్స్థవంశనగరి.
| 129
|
- ↑ సుంకసాల
- ↑ క.మధునీరసంబైన
- ↑ క.పట్టణంబైన
- ↑ క.నయ్యి