అష్టాదశవర్ణన
పెద్దిరాజు – అలంకారము [3-92]
మ. |
పురవారాశిమహీదరర్తుశశభృత్పూషోదయోద్యానపు
ష్కరకేళీమధుపాన[1]మోహనవియోగక్షేమయానస్వయం
వరపుత్త్రోత్సవమంత్రదూత్యరణదోర్వైక్రాంతిసంకీర్తనా
కర మష్టాదశవర్ణనాన్వితము సత్కావ్యంబు భవ్యం బిలన్.
| 124
|
ప్రౌఢకవి మల్లన – రుక్మాంగదచరిత్ర [1-18]
క. |
వనజలకేళీరవిశశి
తనయోదయపానయానదౌత్యాబ్ధివివా
హనృపతివిరహఋతుమం
త్రనగాహవనగరవర్ణనలు దగుఁ గృతులన్.
| 125
|
పురవర్ణన
పెద్దిరాజు – అలంకారము [3-93]
క. |
దుర్గమపరిఖావరణని
సర్గబలానీకచతురచాతుర్వర్ణ్యా
నర్గళసంపద్ఘనజల
వర్గస్తుతి వలయు నగరవర్ణనములకున్.
| 126
|
[3-94]
సీ. |
గంభీరపరిఖ నాఁగ స్త్రీల కశ్రాంత
కేళీవినోదదీర్ఘిక యనంగ
నుత్తాలసాల[2]1మన్యుల కుబ్బి దివిఁ బ్రాకఁ
జేసిన దీర్ఘనిశ్రేణి యనఁగఁ
జతురచాతుర్వర్ణ్యసంఘ మర్థుల పాలి
రాజితకల్పకారామ మనఁగఁ
భ్రాంతసంస్థితయైన భవజూటవాహిని
భుక్తిముక్తిప్రదస్ఫూర్తి యనఁగఁ
|
|
తే. |
నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించె నేరాజు తనదు పేర
|
|
- ↑ క.మత్తది
- ↑ క.మర్త్యుల