Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిలోకబ్రహ్మ - శివజ్ఞానదీపిక

క.

సుకవులు పలుకఁగఁ [1]గెలఁకులఁ
గుకవులు దా రఱతు [2]రౌర కొలఁకు లభ్రమర
ప్రకరము ఝంకారింపఁగ
బెకబెక మనకేల మాను భేకము లవలన్.

118

అమడూరి నరసింహభట్టు - షోడశరాజుచరిత్ర

శా.

జంఘాలప్రతిభాను లార్షకవితాసంజాతు లాశుక్రియా
సంఘస్రష్టలు సంఘశః [3]కమలజుల్ సాహిత్యసర్వంకషుల్
సంఘర్షార్హులు గాక కాకవులు లక్ష్యంబే హలిగ్రామఘా
ణంఘణైక్యశరణ్య బల్చ (?) జనిబంధల్ మత్కటాక్షేక్షుకున్.

119

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-7]

శా.

గాఢార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యముల్ లేక వా
చాఢక్కార్భటి [4]తోడ తామ తము [5]మఝ్ఝాయంచుఁ గైవారముల్
ప్రౌఢిం జేయుచుఁ బ్రాజ్ఞుల న్నగుచు గర్వగ్రంథులై యుండు న
మ్మూఢస్వాంతుల మెచ్చకుండుటయు సమ్మోదంబు మాబోంట్లకున్.

120

జక్కన - సాహసాంకము [1-17]

క.

ప్రతిపద్యముఁ జోద్యముగాఁ
గృతిఁ జెప్పిన నొప్పుఁగాక కృతి నొక పద్యం
బతిమూఢుఁడైనఁ జిత్రతఁ
బ్రతిపాదింపఁడె ఘుణాక్షరన్యాయమున్.

121

బొడ్డపాటి పేరమరాజు - సూర్యశతకము

శా.

ఈఁగల్ వోలె వ్రణంబులే వెదకుచు న్నీర్ష్యంబున న్మెచ్చకే
మూఁగల్ వోలె నిరంతరాస్యులగుచున్ మూర్ఖించి తర్కించినన్
వీఁగన్నేరని దుష్కవుల్ బ్రతుకనీ విక్రాంతులైవారి నో
రాఁగన్ బోవఁగనేల సత్కవులు సూర్యా! పద్మినీవల్లభా!

122

మడికి సింగన – వాశిష్ఠరామాయణము [1-7]

చ.

కదిసిన నోరవోయి యొరు కబ్బపు దొంతుల సత్పదార్థముల్
గదుకుచు నెట్టివారిఁ బొడగన్ను [6]గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి నసహ్యమై శునకమార్గమునం జరియించుచున్న త
ద్పదకవు లెల్ల మత్కవితఁ దప్పులు పట్టక వింద్రుగావుతన్.

123
  1. క.నెలవుల, ట.గెళవులు
  2. క.తాకర
  3. ట.కలశజుల్
  4. క.చూపి
  5. క.మజ్జా
  6. క.బుట్టని