|
తిం దన హస్తరంధ్రముగతిం జొరు నాభరణాహిరాజి [1]వో
వం దలయూపు విఘ్నపతి భాసురభూత్కృతి మమ్ముఁ బ్రోవుతన్.
| 83
|
షణ్ముఖస్తవము
జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము
చ. |
తమకముతోడఁ దల్లియును దండ్రియు నొక్కట ముద్దు వేఁడ సం
భ్రమమున వచ్చి తల్లిముఖపద్మముఁ దండ్రి మొగంబు లైదు వే
గమ తన యాఱుమోములను గైకొని ముద్దిడు మేటి[2]వేల్పు దాఁ
గొమరున నాదు వాణికి నకుంఠితశబ్దము లిచ్చుఁగావుతన్.
| 84
|
చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము
చ. |
చనవున రెండు వక్త్రములఁ జన్నుల పా ల్గుడువంగ నొక్క[3]మో
ము నగఁగ నొక్క యాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యముం
గనఁగ నిదేమి [4]లెక్కెదని యాలపనంబునఁ [5]జెక్కురింప ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు [6]నిచ్చుతన్.
| 85
|
భైరవస్తుతి
[వల్లభామాత్యుఁడు -] వీథినాటకము [?]
సీ. |
చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు
విమలదంష్ట్రాప్రరోహములవానిఁ
బవడంపుఁగొనలతోఁ బ్రతివచ్చు ననవచ్చుఁ
గుటిలకోమలజటాచ్ఛటలవాని
నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చుఁ
గమనీయతరదేహకాంతివాని
నుడురాజరుచులతో నొరవచ్చు ననవచ్చు
చంచన్మహాట్టహాసములవాని
|
|
తే. |
సిగ్గుమాలిన మొలవానిఁ జిఱుతవాని
నెల్లకాలంబు ములికినాఁ డేలువాని
నర్థి [7]మోపూర నవతారమైనవాని
భైరవునిఁ [8]గొల్వ వచ్చిరి భక్తవరులు.
| 86
|
- ↑ క.బోవం
- ↑ ట.వేలుపుంగొమరుఁడు
- ↑ క.మోమునదగగంగ
- ↑ ట.పల్కదని
- ↑ ట.బెక్కులించు[?]
- ↑ ట.నీవుతన్
- ↑ క.మోవూర
- ↑ క.గొలువ