Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైలారస్తుతి

[వల్లభామాత్యుఁడు] వీథినాటకము [145]

సీ.

శనివారసిద్ధి సజ్జనపారిజాతంబు,
              [వరదాత] యాదిత్యవార[భోగి]
మా లచ్చి రమణుండు మాపాలి పెన్నిధి
              [1](మాళవీప్రియభర్త మహితయశుఁడు
కత్రశాలస్వామి కరుణాపయోరాశి
              పుణ్యకీర్తనుఁ [2]డైన [3]ప్రోలి యయ్య
[4]పల్లెమ్మనాయకుం డెల్ల వేల్పుల రాజు
              [5][గనపవేఁటల వేడ్కకాండ్ర భర్త


తే.

మంచు కుంచాలఁ గొలువంగ మాయలేళ్ళఁ
బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి
భైరవుని తోడిజోడు మైలారుదేవుఁ
డోరుఁగంటి నివాసి మే లొసఁగుఁగాత].

87

రావిపాటి - త్రిపురారి

మ.

పొల గయ్యంబుల ముద్దుటల్క కలనన్ బుష్పాయుధారాతి మ్రొ
క్కుల దీర్పన్ దలమీఁదఁ గాననగు నీ క్రొమ్మేను పుణ్యాంగనా
తిలకంబైన భవానిపాదనఖపంక్తిం జెంద డెందంబులోఁ
దల తాల్చు న్నెలతోడి మక్కువలు చంద్రా! రోహిణీవల్లభా!

88

వైనతేయస్తుతి

భైరవుని శ్రీరంగమాహాత్మ్యము [1-3]

ఉ.

ఆయతచండతుండనిహతాహినికాయునిఁ దప్తహాటక
చ్ఛాయుని సర్వవేదమయసన్నుతకాయుని దేవదానవా
జేయుని నప్రమేయుని నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతింతు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.

89

భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర

సీ.

ఉప్పరం బెగయఁగ నొదవిన వెరవున
              సడిసన్న రోహణశైల మనఁగ
వినతాసుతాకృతి వినువీథి వర్తిల్లు
              బాలభానుప్రభాపటల మనఁగఁ

  1. క.ఇహపరదాని జంభీరమగుఁడు ?
  2. క.డన
  3. క.బోలి
  4. క.పల్లెంబనాయఁడు యెల్ల
  5. తాటాకుశిథిలము. సగము పోయినది.