తే. |
నిక్కి కొనకొమ్మ లందుచో నీవి జాఱి
బయలుపడి యొప్పు నాభి[1]కూపముల సొబగు
లంగలతలకు నరవిరులై చెలంగ
సతులు పుష్పాపచయకేళి సలిపి రర్థి.
| 68
|
చ. |
పొడవున నున్న పల్లవునిఁ బువ్వుల వేఁడుచు నొక్క నెయ్యపుం
బడఁతుక హస్త మెత్తుటయుఁ బయ్యెద జాఱి కుచోదయాద్రిపై
బొడచి వినూత్నరాగరుచిఁ బొల్పు వహించు నఖాంకచంద్రుచే
ముడిఁగె నొకింతలో సవతిముద్దియపిండు ముఖారవిందముల్.
| 69
|
[2]తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము
సీ. |
నిఱుపేదకౌ నింత నిక్కింతన దళియై
రోమాళి తన కలరూపుఁ దెలుప
నున్నతోన్నతమూర్తిఁ జెన్నొందు కటిసీమ
కనయంబు తొంటి పొంకంబు సడలి
పనపుఁబయ్యెదఁ జాఱ బయలైన పాలిండ్లు
చూపరకోర్కులు చూఱ లిడఁగ
నవవిభాగంబు నన లవలవై యున్న
వేణి దొల్తటి కమ్మవిరులు దొరుగఁ
|
|
ఆ. |
గక్షభాగరుచులు కనకంపుఁబొడి వెద
చల్లు లాడు నొక్కచంద్రవదన
కొసరి కుసుమబంతిఁ గోయు కైతవమున
నత్తపస్విమ్రోల బిత్తరించె.
| 70
|
భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-69]
సీ. |
పదముల కెంజాయ పరగనిచ్చినచోటఁ
జిగురాకు పఱిచిన చెలువు [3]నెఱప
తీగకై[4]వడి గౌను సాగనిక్కిన నీవి
వెడజాఱి [5]నతనాభి[6]బెడఁగు దెలుపఁ
బరువంపువిరులపైఁ బచరించు చూడ్కులు
మొగమెల్లఁ గన్నులై మొరువు చూప
గేలు సాఁచిన నివ్వగిలు కక్షకాంతులు
జిగు చన్నుఁగ్రేవల జీరువాఱ
|
|
- ↑ చ.రూపముల
- ↑ తెన్నల
- ↑ చ.నొరువ
- ↑ చ.యర
- ↑ చ.తన
- ↑ చ.వెగడు