Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శుకపుష్పాగ్నులఁ జైత్రయాజకుఁడు దా సూనేష్వజప్రీతి ను
త్సుకతన్ వ్రేల్చె ద్విజాతియందు శశి[1]దత్తున్ శ్రీవశున్ బ్రేమతోన్.

65

వనవిహారము

పెద్దిరాజు – అలంకారము [3-115]

క.

చారుతరచైత్రసంప
త్పూరితవిభవముల వేడ్క పొంగుడువడఁగా
నారీజనసహచరుఁడై
యారామవిహార మొప్ప నధిపతి సేయున్.

66

[3-116]

సీ.

మానినీగండూషమధువులఁ బూచిన
              [2]పొగడను సొబగొప్పఁ బొగడి పొగడి
నారీపదాహతి ననిచిన కంకేలి
              పరువంబు నగ్గించి పలికి పలికి
లలనావలోకనంబులఁ బుప్పితంబగు
              తిలకంబుపైఁ జూడ్కి త్రిప్పి త్రిప్పి
వనితోపగూహనంబునఁ బేర్చు సురపొన్న
              మేటి పుణ్యమునకు మెచ్చి మెచ్చి


తే.

మన్మథాంశావలుల పొంత మలసి యలసి
శుకపికాళివిహారంబు చూచి చూచి
సతులుఁ దానుఁ జరించు వసంతవేళ
ప్రమదవనమున విశ్వభూపాలవరుఁడు.

67

[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-21]

సీ.

అలరుల కెత్తుచో నఱచేతి కెంజాయ
              లొదవి కోయిలల నోరూరఁజేయు
నునుమేను లలసి మ్రానులమీఁద నొరగుటల్
              తీవెలు [4]వ్రాకిన తెఱఁగు దెలుపఁ
జెలికత్తియల లీలఁ బిలుచు నున్పలుకుల
              మదకీరసమితికి మాట లార్ప
భుగభుగ వలచు నూర్పుల తావు లెసఁగి క్రొ
              న్ననలకు వింతవాసన లొసంగ

  1. చ.రర్తు
  2. చ.+++పొగడల
  3. సుంకసాల
  4. చ.దాఁకిన