Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-100]

సీ.⁠

మంచున మేనెల్ల [1]మరించి పత్రసం
              చయమును డుల్చు విశల్యకరణి
ముదిరిన తరుజాతమునకుఁ జిత్రంబుగాఁ
              దారుణ్య మొసఁగు సంధానకరణి
పసరు చందముఁ దోఁచి యొసఁగెడు కోరక
              వ్రాతంబునకును సౌవర్ణకరణి
హరునిచే మటుమాయమై మే నెఱుంగని
              చిత్తజాతునకు సంజీవకరణి

⁠


తే.⁠

పలుకనేరని కోకిలప్రకరమునకు
నంచితస్వర మిచ్చు మహౌషధంబు
కాముకశ్రేణులకునెల్లఁ గాలకూట
మనఁగ మించె వసంతసమాగమంబు.

⁠ 61

[?] - వెంకటవిలాసము

శా.⁠

చాతుర్యం బెసగన్ హిమాహ్వయదశాస్యధ్వంసియై తెచ్చె వి
ఖ్యాతిం బంకజలక్ష్మి సీత బలె దానారామనామస్థితిన్
చేతోజాతవిభాషణున్ నిలువఁజేసెన్ జేసి యిట్లేలకో
జాతిద్వేషము పూనె రామసమతన్ జైత్రుండు పెంపొందియున్.

⁠ 62

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

తే.⁠

రాగరంజితకుసుమపరాగపటలు
లంబరముఁ గప్పె మలయజోద్ధతము లగుచు
గగనచరులెల్ల వీథు లుత్కంఠ నాడు
రమ్యవాసంతకుంకుమరజ మనంగ.

⁠ 63

మడికి సింగయ – వశిష్ఠరామాయణము [4-4]

ఉ.⁠

అంతఁ బ్రవేశమయ్యె మదనాధిపరాజ్యరమావిభూషణా
నంతము భూరిసౌరభలతాంతము కోకిలచంచరీకసా
మంతము పూర్ణచంద్రరుచిమంతము పాంథవిలాసినీమనో
ధ్వాంతము దంపతిస్వదనవంతము నాఁగ వసంత మున్నతిన్.

⁠ 64

నండూరి మల్లయ్య - హరిదత్తోపాఖ్యానము

మ.⁠

శుకవాక్యస్ఫుటమంత్రముల్ దనర నస్తోకప్రసూనోల్లస
న్మకరం[2]దాజ్యసుధార లొప్పఁగ వసంతక్ష్మాలసద్వీథిఁ గిం

⁠
  1. ↑ చ.డించిన
  2. ↑ చ.దాఖ్య