Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిమూర్తిస్తుతి

చ.

కమలజకృష్ణశంకరులు కాంచననీలపటీరవర్ణు లా
గమనగచంద్రధారు లఘకంసపురారు(లు) హంసతార్క్ష్యగో
గమనులు జన్మపోషలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
శమకరుణావిభూతిగుణసక్తులు ప్రోతురు మమ్ము నెప్పుడున్.

60

అష్టదిక్పాలకస్తుతి

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరితము [1-10]

చ.

హరిశిఖి[1]దంతి దైత్యవరుణానిలయక్షశివుల్ గజాజ[2]కా
సరనరనక్ర[3]కైణహయశాక్వరయానులు వజ్రశక్తి ము
ద్గరశరపాశకుంతసృణికార్ముకహస్తులు భోగశుద్ధిసం
గరజయశౌర్యసత్త్వజవకామ్యవిభూతులు మాకు నీవుతన్.

61

లక్ష్మీస్తుతి

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-6]

సీ.

[4]తమము [5]క్రొన్నెలవిండ్లు తమ్ములు శ్రీ [6]లద
              ములు [7]చంపకము [8]ముత్యములు పగడము
శశి [9]కందుకము [10]సంకు జక్కవల్ [11]వసుగుహల్
              బిసము లబ్జంబులు పెసరుగాయ
లలరులు ఫణివీచు లభ్రంబు నుడి రావి
              యాకు సైకత మంటు లతనుదొనలు
మఱిపండులు ప్రసూనమంజరుల్ కూర్మముల్
              మణులు తార లిగుళ్ళు మరునిపలక


తే.

యనఁగఁ దగు ముప్పదియునాల్గు నంగకముల
గంధగజయాన కలకంఠి కనకవర్ణ
పుష్పగంధి లతాంగి కర్పూరహాస
నీరవధికన్య మాయింట నిలుచుఁగాత.

62

పెద్దిరాజు అలంకారము [1-2]

ఉ.

పంకజముం దొఱంగి తదుపాంతచరన్మధుపప్రసక్తికిన్
గొంకి ఝషాది(రూ)పములకుం జను నాథునివింత య(క్కుపై)

  1. క.దండి
  2. క.వాశ్చర
  3. క.యేణ
  4. క.తమ్మముల్
  5. క.నెలవిండ్లు
  6. క.లదములు
  7. క.చున్చుకము
  8. క.ముత్యమూ
  9. క.కందురము
  10. క.శంఖు
  11. క.వళు