Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]గింకిరి గాఁగ లచ్చి పరికించి యజస్రము నుండుఁగాత ని
శ్శంకఁ జళుక్యవిశ్వనృపసత్తము పుణ్యకటాక్షదృష్టులన్.

63

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-11]

మ.

హరికిం బట్టపుదేవి పుణ్యములప్రో [2]వర్థంపుఁబెన్నిక్క చం
దురుతోఁబుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములఁ బాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

64

పార్వతీస్తుతి

బమ్మెర పోతరాజు – భాగవతము [ప్రథమస్కంధము] [1-10]

ఉ.

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి [3]యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.

65

ఏర్చూరి సింగరాజు - షష్టస్కంధము [1-7]

క.

కాళికి సన్నుతబహులో
కాళికిఁ గమనీయవలయకర[4]కీలితకం
కాళికిఁ దాపసమానవ
కేళికి వందనము సేసి కీర్తింతు మదిన్.

66

మడికి సింగన – వాశిష్ఠరామాయణము [1-2]

ఉ.

శ్రీ యన విష్ణు పేరురముఁ జెన్ను వహించి యలంకరించి దా
క్షాయణి నాఁగ శంభుమెయి సామున నెక్కొని వాణి నాఁగ నా
తోయజగర్భు నెమ్మొగముఁ దూఁకొని యేలెడు నాదిశక్తి సు
శ్రీయుఁ జిరాయువున్ సరస[5]సిద్ధకవిత్వము మాకు నీవుతన్.

67

రావిపాటి త్రిపురారి [అంబికాశతకము]

ఉ.

భారతివై సరోజభవుపాల వహించి రమావధూటివై
నీరజనాభుఁ జెంది ధరణీధరనందనవై మహేశ్వరున్

  1. క.రాంకకుగాక
  2. క. అర్థంబు పెన్నీట
  3. క.యీవుత
  4. క.ధృత
  5. క.శిక్ష