Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గనియెఁ జిత్రంబునకు వీరి గలసియుండ
మనుపఁ జెఱుపంగఁ [1]జెఱుపంగ మనుప నేర్తు
రెల్ల లోకములకు దైవ మేకమగుట
హరిహరాత్మక మెఱిఁగితి మనిరి సురలు.

56

కవిలోకబ్రహ్మ - శివజ్ఞానదీపిక

[పెదపాటి సోమరాజు]

సీ.

బవరాన సూతుఁడై పార్థున కాతండు
              నచ్చినాఁ డీతండు మెచ్చినాఁడు
చంచత్కృపాస్ఫూర్తిఁ బంచాస్త్రు నాతండు
              పెంచినాఁ డీతండు నొంచినాఁడు
శేషపన్నగరాజు సెజ్జగా నాతండు
              వ్రాల్చినాఁ డీతండు దాల్చినాఁడు
హాలాహలముఁ జూచి యల్లంత నాతండు
              చెంగినాఁ డీతండు మ్రింగినాఁడు


తే.

చక్రి యాతండు వసుమతిచక్రి యితఁడు
[2]సవనపరుఁ డాతఁ డీతండు హరణ[3]పరుఁడు
విశ్వమయుఁ డాతఁ డీతండు విశ్వనాథుఁ
డనుచు హరిహరనాథుల నభినుతింతు.

57

బ్రహ్మస్తుతి

[4]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము పీ. 2

చ.

పొలయలుకన్ జపంబునకుఁ బూని కనుంగవ లెల్ల [5]మోడ్చియుం
దలపున మంత్రవర్ణమయతన్ గనుపట్టిన వాణిఁ జూచి న
వ్వొలయఁగఁ గౌఁగలించి [6]సుసుఖోన్నతిఁ జెందెడి విశ్వతోముఖం
డెలమిఁ దలిర్ప మత్కృతికి నీవుత విశ్వజనాభిముఖ్యమున్.

58

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

చ.

వల పెటువంటిదో ముసలివాఁ డనవచ్చునె యద్దిరయ్య ప
ల్కుల జవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునఁ గట్టిన [7]యట్టులుంటు (నీ)
నలువకు నంచుఁ [8]గాముఁడన నవ్వు విధాత శుభంబు లీవుతన్.

59
  1. క.బెనుపంగ
  2. క.యవన
  3. క.వరుఁడు
  4. సుంకెసాల
  5. క.మోడ్చినన్
  6. క.ససుఖోన్నతి
  7. ట.యట్లయండు
  8. ట.గాముకులు