|
శ్రీలక్ష్మి నిల్చె రాజీవపీఠి
వాజువాఱఁగఁ జొచ్చె వరుణుని దిక్కున
[1]నేర్పడి దీపించెఁ దూర్పువలను
|
|
తే. |
తార లుడివోయె వికసించెఁ దరుల విరులు
చంద్రికలు గందెఁ గొలఁకులు చాలఁ దేరె
దీపరుచి దాఁగెఁ దలసూపె రేపటెండ
చందురుఁడు వ్రాలెఁ [2]బొడిచె కంజాతహితుఁడు.
| 247
|
ఉదయరాగము
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-202]
సీ. |
కాలిగోణంబు లాకాశసన్యాసికం
బరకపాలికులకు మరులు జడలు
చిగురాకుఁబొరకలు గగనచూతమునకు
వలఁతియూడలు వియద్వటమునకును
సట లంతరిక్షకేసరికంధరమునకు
జమలియీఁకలు నభస్తారునకును
రాగిమీసంబు లభ్రకిరాతు మొగమున
బగడంపులత లుడుపథపయోధి
|
|
తే. |
కనెడు సందేహచింతనం బావహిల్ల
యావకద్రవరేఖల యంద మొంది
పట్టుసూత్రవిలాసంబు పరిభవించి
యాకసముఁ [3]దాకెఁ [4]దూర్పున నరుణరుచులు.
| 248
|
శ్రీనాథుఁడు – కాశీఖండము [1-123]
సీ. |
తఱపివెన్నెలలోని ధావళ్య మొకకొంత
నవసుధాకర్దమద్రవము గాఁగఁ
జిన్నారి పొన్నారి చిఱుతచీఁకటి చాయ
యసలు కొల్పిన ముషీరసము గాఁగ
నిద్ర మేల్కాంచిన నెత్తమ్మిమొగడల
పరువంపుఁబుప్పొళ్ళు హరిదళముగఁ
దొగరు[5]వన్నియ లేఁత తొలుసంజకెంజాయ
కమనీయధాతురాగంబు గాఁగ
|
|
- ↑ గ.నేర్పున
- ↑ గ.హెచ్చె
- ↑ క.ప్రాకె
- ↑ క.గ.నేర్పున
- ↑ క.వన్నెల, గ.వెన్నెల