Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభాతము

భాస్కరుఁడు - అయోధ్యకాండము [25]

చ.

అళికుల మల్లనల్ల నవహల్లక మొల్లక కేసరోల్లస
ద్ధళదరవిందమందిర[1]వితానము చేర నపారదీర్ఘికా
జలజనవీనగంధములు చల్లుచుఁ జల్లనిగాడ్పు లిమ్ములన్
బొలయ గృహప్రదీపికల పోడిమి దూలఁ బ్రభాత మొప్పినన్.

244

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [3-187]

చ.

వెలవెలఁ బాఱెఁ దూర్పు[2]దెస విల్లు మనోభవుఁ డెక్కుడించెఁ దా
రలపొది విప్పఁజొచ్చె ననురక్తిఁ జెలంగె రథాంగదంపతుల్
జలములు నుల్లసిల్లె విలసద్గతి వీచెఁ బ్రభాతవాయువుల్
కలకలఁ బల్కెఁ బక్షులు వికాసము కల్వలఁ బాసె నయ్యెడన్.

245

పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-203]

సీ.

ఒక్కింత వెన్నెల యూర్చి తీసిన భంగి
              నుదధీశు దెసకునై యోడిగిలగఁ
గమలి మిం చెడలిన కంచుటద్దము వోలె
              నస్తాద్రిపైఁ జంద్రుఁ డస్తమిల్ల
జలము లూటలుగ్రమ్ము శశికాంతపాషాణ
              నికరంబు [3]నీరారి నీరు దివియ
భానుమత్పాషాణఫలకమధ్యంబులఁ
              గోకయుగ్మము కంతుగోష్ఠి నెఱప


తే.

నబ్జగంధంబు తేఁటులు నామతింప
దికమక ల్గొని నాలుగుదిక్కులకును
విచ్చి విచ్చి జకోరముల్ వెళ్ళఁబాఱ
నల్లనల్లన తూరుపు దెల్లవాఱె.

246

[4]తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము

సీ.

[5]నీ రింకఁదొడఁగె వెన్నెల మానికంబుల
              వేఁడిరాతూపుల విడిసె వహ్ని
కలఁగె జీవంజీవముల నిండుమనములు
              జక్కవపులుఁగుల జాలి వదలెఁ
గనుమాసెఁ గుముదకాననవిభావిభవంబు

  1. క.గ.విలాసము
  2. క.గ.ననవిల్తు
  3. గ.నీరాసి
  4. తెన్నల
  5. గ.నిక్కదొణంగె