తే. |
వర్ణములు గూడి యామినీవ్యపగమమున
జగము చిత్రింపఁ దూలిక చందమైన
కొమరుఁబ్రాయంపు నూనూఁగుకొదమయెండ
ప్రాచి కభనవమాణిక్యపదక మయ్యె.
| 249
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-11]
సీ. |
ఆమ్నాయశాఖాసహస్రవివర్తంబు
లుడురాజకళ్యాణహోమవహ్ను
లాకాశహర్మ్యాగ్రహస్తదీపంబులు
ప్రాలేయజలరాశిబాడబములు
చక్రవాకమనోవిశల్యౌషధంబులు
దశదిశాకుంకుమస్థాపకములు
రాజమండలకాంతిరాజయక్ష్మము లంధ
కారవేదండకంఠీరవములు
|
|
తే. |
పద్మవననిర్ణిబంధనబాంధవములు
కైరవాకరసమ్మోహకారణములు
సవితృమణిపావకేంధనస్వామిధేను
లెగసె నుదయాద్రి [1]యవుల నీరెండకొనలు.
| 250
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-66]
తే. |
రాజు వీడెత్తి చనినఁ దారకభటాలి
యంబరాభోగనిజశిబిరాంచలమునఁ
గాలుకొలిపిన పావకజ్వాల లనఁగఁ
బ్రాచిఁ గనుపట్టె నవసాంధ్యరాగరుచులు.
| 251
|
అంగర బసవయ - ఇందుమతీకల్యాణము
మ. |
ఉదయస్తంభములోపల న్వెడలి తా నుద్యత్తమోదైత్యునిన్
గుదియంబట్టి గభస్తిమన్నృహరి సక్రోధంబునన్ వాని దు
ర్మదగాత్రంబు కరంబులం [2]దునుమ ధారాళాస్రపూరంబు[3]గా
రి దివిం బర్వినకైవడిం గలయఁబర్వెన్ సాంధ్య[4]రాగచ్ఛవుల్.
| 252
|
ఉ. |
నీలపయోదగాత్ర! కమనీయపయోరుహనేత్ర! [5]సంస్కృతి
వ్యాళపతంగ! సముదంచితభానుసహస్రతేజ! ని
|
|
- ↑ గ.మీద
- ↑ గ.మెరయ
- ↑ చ.కారి
- ↑ క.గ.రాగచ్ఛవిన్
- ↑ గ.సంస్వతి, క. + + + +తి