ముక్కు తిమ్మన – పారిజాతము [2-49]
సీ. |
విరహుల మైసోఁకి వేఁడియౌ వెన్నెలఁ
బచ్చివెన్నెల నులివెచ్చఁ జేసి
కలువపుప్పొళ్ళచేఁ గసటైన వెన్నెల
వలిపవెన్నెలలోన వడిచి తేర్చి
చంద్రకాంతపునీట జాలైన వెన్నెల
ముదురువెన్నెల జుఱ్ఱఁ బదను సేసి
సతుల మైపూఁతం బిసాళించు వెన్నెలఁ
దనుపువెన్నెల రసాయనము గూర్చి
|
|
తే. |
చిగురువిలుకాని జాతర సేయఁబూని
కులముసాము లందఱఁ గూడఁబెట్టి
వంతు గలయంగఁ బువ్వంపుబంతి విందు
పెట్టి రెలమిఁ జకోరపుఁబేరఁటాండ్రు.
| 213
|
ఎడపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
కొమరువెన్నెల[1]మోసు నమలి ప్రాణేశ్వరు
కొసఁగి యింపొనరించు నొక చకోరి
పరపువెన్నెలగుజ్జు బంతెనగూళ్ళాడు
నోలి నెచ్చెలులతో నొక చకోరి
పాటైన వెన్నెలతేఁట కేళాకూళి
నోలలాడుచునుండు నొక చకోరి
గట్టివెన్నెల చల్దిగాఁ గట్టి వల్లభు
నుడురాజు కడ కంపు నొక చకోరి
|
|
తే. |
[2]చేగవెన్నెలక్రొవ్వు భంజించి విందు
లొనరఁజేయును జుట్టాల కొక చకోరి
పండువెన్నెలపేస మేర్పఱిచి పతికి
నుబ్బుగా నిచ్చు [3]వేడుక నొక చకోరి.
| 214
|
పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము
సీ. |
బ్రాఁతియే యిఁకఁ గల్గు లేఁతవెన్నెల నిగ్గు
[4]లగ్గువెట్టెద నీకు నూరకుండు
మునుపుగా నీకిత్తు ముదరవెన్నెల[5]సోగ
సంతసంబున నుండు జాలి మాని
వేగిరింపకు నీకు వెలఁదివెన్నెలక్రొవ్వుఁ
గుడిపింతు జిన్నారి కడుపునిండ
|
|
- ↑ గ.మేను
- ↑ గ.చేణి
- ↑ క.వేకువ
- ↑ గ.నూరి
- ↑ చ.సోగు