Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]యింతముచ్చట వాయ నీఁదింతుఁ బండువె
              న్నెలవెల్లి [2]బలుమాఱు నిన్నుఁ జేరి


తే.

కూయకుఁడు మీరు సంతుష్టిఁ గూరినపుడు
శీతలంబగు వెన్నెల చిగురుపాన్పు
నందు నిడి నిద్రపుచ్చెద ననుచు నాద
రించె బిడ్డల నొకచకోరీపురంధ్రి.

215

వేగుఁజుక్క

తులసి బసవయ్య - సావిత్రికథ

తే.

గగనలక్ష్మీవధూటికిఁ గలశవార్ధి
యుమ్మితోడ నుపాయనం బిచ్చినట్టి
క్రొత్తకట్టాణి ముంగఱముత్తె మనఁగ
జూడ నొప్పారి వేగురిఁజుక్క వొడిచె.

216

ముక్కు తిమ్మన – పారిజాతము [2-54]

మ.

నలినాప్తుండు మదీయబంధువుల నీ నక్షత్రసంఘంబులన్
గలఁప న్వచ్చుచునున్నవాఁ డనుచు మున్గల్గంగ నాత్మీయ[3]శిం
ధులమందేహులఁ బోరొనర్పఁ జనుఁడంచుం బంపి నేతెంచెనాఁ
బొలిచెన్ వేగురుఁజుక్క కాలఫణభృద్భోగోల్లసద్రత్నమై.

217

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము

క.

ఉడురాజు కొలువుదీరిన
నుడుగణపరివారసమితి నొఱవుగ ననుపన్
వడివచ్చు కటికవాఁ డనఁ
బొడజూపెన్ వేగుఁజుక్క పురుహూతు దెసన్.

218

పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము

తే.

మిక్కుటపుఁగాంతి వేగురుఁజుక్క వొడిచె
బారెఁడెక్కిన యపుడు గన్పట్టి యుండె
నినుఁ డరుగుఁదెంచు [4]నని రాగ మెసఁగఁ బ్రావి
[5]మురువుగాఁ దాల్చు నాసికాభరణ మనఁగ.

219
  1. క.చ.యిట్టి
  2. గ.నురూరు
  3. క.గ.బంధుల
  4. చ.నను
  5. గ.మునుపు