Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు - వల్లభాభ్యుదయము

సీ.

రజనీవధూకర్ణరజతతాటంకంబు
              వలరాజుధవళోష్ణవారణంబు
ప్రోషితయువతిహృత్పుటభేదదాత్రంబు
              బహుచకోరకుటుంబపానపాత్ర
మధుకైటభాసురమథను దాఁపటికన్ను
              చక్రవాకంబుల చల్లజంపు
దుగ్ధపాథోరాశి తొలిచూలి సంతతి
              రోహిణీదేవితారుణ్యఫలము


తే.

చంద్రకాంతశిలా[1]మణిస్థలకృపీట
నిర్థ[2]రాదోవ్యథామోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటాహాలహల[3]హరుండు
చంద్రుఁ డొప్పారెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.

199

చంద్రునిలో మచ్చ

[4]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-132]

క.

[5]ప్రమథపతిమూర్తిచంద్రుఁడు
తిమిరగజాసురు నణంచి తిత్తొలచిన త
త్యమధిక చర్మముఁ దాల్చిన
క్రమమున నంకంబు గడుఁ బ్రకాశితమయ్యెన్.

200

శ్రీనాథుఁడు – భీమఖండము [2-45]

సీ.

రోహిణీగాఢోపగూహనంబునఁ గన్న
              కస్తూరికాస్థానకం బనంగ
రాహుదంష్ట్రాఘాతరంధ్రమార్గంబున
              లలిఁ దోఁచు నాకాశలవ మనంగ
నైర్మల్యమునఁ [6]జేసి నడుమఁ గానఁగ వచ్చు
              కమిచి మ్రింగిన యంధకార మనఁగ
జన్మ[7]వేళను మంథశైలాభిఘట్టన
              సంభవించిన కిణస్థాన మనఁగ


తే.

విరహపరితాపభరమున వేఁగుచున్న
చక్రవాకాంగనల కటాక్షముల యగ్గి

  1. క.నునికరకృపిట, చ.నునిలకృపీట?
  2. క.రాంభ లామోక్ష, గ.రాంబుధిమోక్షక
  3. గ.ధరుండు
  4. సుంకిసాల
  5. క.గ.ప్రమదాతి
  6. క.గ.దోచు
  7. క.గ.కాలము