Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]నావహిల్లిన కఱధూప మనఁగ నొప్పె
నడుగణాధీశబింబంబు నడిమి మచ్చ.

201

ముక్కు తిమ్మన – పారిజాతము [2-46]

చ.

తొలుమలఱాతితో నొరయు తూరుపుఁదొయ్యలి ముత్తియంపుఁగుం
డలమున మానికంబు పడినం గనుపట్టెడు లక్కగూఁడు నాఁ
జలువలఱేని యప్పొడుపుఁజాయఁ దొఱంగిన కందు దోఁచె రే
చెలువ కనుంగవం గమియఁజెందిన కాటుకకప్పు కైవడిన్‌.

202

[?]

ఉ.

ప్రేమముతోఁ జకోర[2]శిశుబృందము ముక్కుల కెక్కకుండ జ్యో
త్స్నామృతధార [3]వంచుటకు నై యుడురాట్కలశీముఖంబులన్
యామవతీవిలాసవతి యడ్డము వెట్టిన హస్తమో యనం
గా మెఱసెన్ బరిస్ఫురితకజ్జలదీధితిచిహ్న మయ్యెడన్.

203

రావిపాటి త్రిపురారి - తారావళి

మ.

రతినాథుం డను మాయజోగి చదలం ద్రైలోక్యవైశ్యాజనం
బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయంబై యున్న పాత్రంబునన్
మతకం బేర్పడఁ బెట్టి దాఁచెనన మీ మధ్యంబునన్ మత్ససం
తతమున్ గన్నులపండువై వెలయు చంద్రా! రోహిణీవల్లభా!

204

చంద్రిక

జక్కన - సాహసాంకము [6-69]

సీ.

గంగాప్రవాహంబు గాఁబోలు నని వసి
              ష్ఠాదు లనుష్ఠాన మాచరింప
నమృతంపువెల్లువ యని నిలింపాదులు
              మునుకొని దోసిళ్ళ ముంచి క్రోల
దుగ్ధాంబునిధి యని తోయజాక్షుఁడు శేష
              పర్యంక మిడుకొని పవ్వళింపఁ
బరమేశు విశ్వరూపం బని బ్రహ్మాదు
              లమరదండప్రణామములు సేయఁ


తే.

దలఁప భూనభోంతరముల కొలఁది దెలిసి
[4]బెరసి యెనిమిది దిక్కులఁ బొరలి పొరలి

  1. క.గ.నావహించిన
  2. క.శశి
  3. క.నొంచుటకు
  4. గ.వెరసి