|
గౌముదీసుధ వోయఁగాఁ జకోరములకు
నలువ యెత్తెడు రత్నకలశ మనఁగ
|
|
తే. |
జారతస్కరలోకసంహారమునకు
సమయ మనియెడు నలికలాంఛనుఁడు చాలఁ
గినిసి తెఱచిన యలికలోచన మనంగ
నిండుకెంజాయఁ జంద్రుఁడు నింగి వొడిచె.
| 192
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
[1]సీ. |
మన్మథదివ్యాగమమున కోంకారంబు
భూతేశు నౌదలఁ బువ్వుదండ
యమితశృంగారరేఖార్గళకుంచిక
యధికతమోదంతి కంకుశంబు
విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి
యంబరక్రోడదంష్ట్రాంకురంబు
తారకామౌక్తిక[2]తతికి నంచితశుక్తి
తగిన భోజునికి ముత్యాలజోఁగు
|
|
తే. |
మారుపట్టాభిషే[3]కాగ్రవారికుంభి
చిత్తజుని కోటలగ్గదంచెనపుగుండు
నాఁగ నానాఁటి కబివృద్ధి నారుకొనిన
చంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.
| 193
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-154]
[4]మ. |
కుముదోజ్జీవనమంత్ర మంగజభుజాకోదండగర్వంబు సం
తమసానేకపకూటపాకలము, జ్యోత్స్నావర్షివర్షాపయో
దము పాంథవ్రజచిత్తశల్యము నిశాధమ్మిల్లబంధూకగు
చ్ఛము, ప్రాచీనగశృంగవీథిఁ బొడిచెం జంద్రుండు సాంద్రద్యుతిన్.
| 194
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-41]
చ. |
అమరుల బోనపుట్టిక సహస్రమయూఖుని జోడుకోడె సం
తమసము వేరువిత్తు కుముదంబుల చక్కిలిగింత [5]పుంశ్చలీ
సమితికిఁ జుక్కవాలు నవసారసలక్ష్మి తొలంగు బావ కో
కములకు గుండెతల్లడము కైరవమిత్రుఁడు దోఁచెఁ దూర్పునన్.
| 195
|
- ↑ క.లో లేదు.
- ↑ క.పతికి
- ↑ గ.కాఘన్య
- ↑ క.లో లేదు.
- ↑ గ.పుంభవీ