Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జదలుగేదఁగి తూర్పు తుదకొమ్మ నరవిరి
              యై కానిపించు పూరేకు లనఁగఁ
బొడుపుగుబ్బలి [1]నేల పురిటింటి యిడుపునఁ
              జఱచిన గందంపుఁజట్ట లనఁగ
మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి
              కులము చేతుల వెండిగుదియ లనఁగఁ


తే.

గైరవములకు [2]వెన్నెల నీరు వఱపఁ
బూని చేర్చిన పటికంపుదోను లనఁగఁ
గ్రమముతో శీత[కర]మయూఖములు గగన
భాగమునఁ గొన్ని యల్లనఁ [3]బ్రాకుఁదెంచె.

186

చంద్రబింబము

ముక్కు తిమ్మన – పారిజాతము [2-45]

[4]మ.

కడఁకన్‌ రేచెలిగట్టుపట్టిఁ దను వేడ్కం గూర్ప నేతెంచి పై
జడిగాఁ జక్కల తూపులేయఁ గినుకన్‌ జాబిల్లిముక్కంటితాఁ
బొడుపుంగెం పనువేఁడికంట నిరులన్ బూవిల్తు [5]మేనేర్చి చొ
ప్పడఁ దద్భూతి యలందె నా నపుడు బింబం బొప్పెఁ బాండుద్యుతిన్‌.

187

చంద్రోదయము

పెద్దిరాజు – అలంకారము [3-111]

క.

మండలశోభయుఁ గైరవ
షండవికాసంబు జలధిసమజృంభణమున్
గొండొక వెన్నెలఁ గ్రోలెడు
నండజముల విధుని బొడుపునం దగుఁ బొగడన్.

188

[3-112]

[6]మ.

అది రౌద్రాకృతిఁ దోఁచెఁ [7]జంద్రుఁడు మయూఖాటోప మేపారె న
ల్లదె మున్నాడెఁ జకోరసంఘ మదె జ్యోత్స్నాపానసంక్రీడకై
యదయుం డంగజుఁ డింక నెట్లగును నీ యాలోకనేందీవరా
పదఁ [8]దూలించెడు చంద్రవంశజుని నొప్పంజూతు రమ్మా సఖీ!

189
  1. గ.కిని
  2. గ.జల్లగా
  3. గ.ప్రోగు
  4. క.లో లేదు.
  5. గ.నర్చించు
  6. క.లో లేదు.
  7. గ.జందురు
  8. గ.మాలించెడు