చోరకులు
అభినవదండి కేతన – దశకుమారము [5-72]
చ. |
[1]పొయితల నీలిదం డొలికి బూడిదె ముండుల [2]బంతి గావిచీ
రయు సెలగోల [3]కత్తి భ్రమరంబుల క్రోలుని మైలమందుకొ
య్యయు [4]నురి[5]గ్రొంకి నారసము లాదిగఁ గల్గిన సాధనంబు లి
న్నియు సమకూరఁజేసికొని నేర్పున నేఁగితి మ్రుచ్చు ప్రొద్దునన్.
| 181
|
[6]చ. |
కలికము నీలికాసెయును గన్నపుఁగత్తియు మేనికాపుముం
దలములు బంతికుంచెయును దాలము చేయును జొక్కుమందు కు
క్కల గుదిగట్టు తుమ్మెదల గ్రమ్మిన క్రోవియుఁ గొంకి నారసం
బలవడఁ బూనెఁ జిక్కన మహాత్ముఁడు చోరకులావతంసుఁడై.
| 182
|
చంద్రకిరణములు
పణిదపు మాధవుడు - ప్రద్యుమ్నవిజయము
చ. |
దలదవదాతకంజదళధాతకనత్కలధౌతమల్లికా
వలులు విలాసలీల శరవర్గమృణాశమనోజ్ఞహారవ
ల్గుల రవణంబునన్ సకలలోకనుతోజ్జ్వలకందబృందకం
దళముల ఛాయఁ జంద్రకిరణంబులకుం దెలుపెక్కె నంతటన్.
| 183
|
చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ - నృసింహపురాణము [3-86]
[7]చ. |
దెసలను గొమ్ము లొయ్య నతిదీర్ఘములైన కరంబులం బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ జేర్చు నా
కస మనుపేరి భూరుహము కాంతనిరంతరతారకాలస
త్కుసుమచయంబు గోయుట కొకోయనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
| 184
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-40]
[8]తే. |
అమరు లమృతాంబునిధిలోని యమృతరసము
వెండిచేరులఁ బటికంపుఁగుండ కట్టి
చేఁదుకొనియెదరో [నాఁగ శీతరోచి]
మెఱుఁగు మేనితో మెల్లన మిన్ను వ్రాఁకె.
| 185
|
[9]సీ. |
కెరలి చీఁకటిమ్రాను గెడపంగ నిక్కిన
సమయగజంబు దంతము లనంగఁ
|
|
- ↑ క.గ.పొయిదల
- ↑ గ.దృప్తి
- ↑ క.రత్తి
- ↑ గ.నులి
- ↑ క.కొంకు, గ.కొక్క
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.