Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

[1]క.

నెఱయఁగ బ్రహ్మాండం బను
కఱటమునం గాటు [2]కడును గలిపిన భంగిన్
గఱిగొని చీఁకటి కన్నులు
దెఱచిన మూసినను నొక్క తెఱగై యుండెన్.

167

అయ్యలార్యుని సింగయ – పద్మపురాణము – ఉత్తరఖండము

[3]క.

కనువిచ్చుటయును మోడ్చుట
యును సరి నుయి గొండ యనుచు నొక్కటియైనన్
దనరి పెనుసూదిఁ బొడిచిన
జినుఁగక యతినిబిడమైన చీఁకటి పర్వెన్.

168

రాత్రి

[4]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-85]

ఉ.

తారకశంఖహారయు నుదారతమోసితకంచు[5]కావృతి
స్ఫారయు నైన యా రజని భైరవి భైరవిఖేలనంబు పెం
పారఁగ వారుణీకలితమై రుచి మించిన సాంధ్యరాగసం
భారము పేరి భూరినవమాంసతతిన్ [6]గబళించె నంతటన్.

169

జారలక్షణము

[ఎఱ్ఱయ] కొక్కోకము

సీ.

తల విప్పి ముడుచుట తన శరీరము గోళ్ళ
              నలముట[7] చేత రొమ్మంటుకొనుట
చేరువఁ గూర్చున్న చెలికత్తెపై [8]నీల్గి
              యావులించుట నొయ్య నడిగికొనుట
తనుఁ గనుగొన్నచో దండంబు పెట్టుట
              [9]యన్యాపదేశంబు లాడుకొనుట
నా మాట వినుమని నయముగా నొకరితోఁ
              బలుకుట యొకరిచే పట్టుకొనుట


తే.

వీడియము చేసి శిశువునో [10]ర్విద్రిచి పట్టి
తమ్మిపెట్టుట పసిబాల నెమ్మిఁబట్టి
యందియిచ్చెడిగతి దేహ [11]మంటుకొనుట
జారగుణముల జనుల లక్షణము లయ్యె.

170
  1. క-లో లేదు.
  2. గ.గడును
  3. క-లో లేదు.
  4. సుంకి
  5. క.కీవృతి, గ.కన్వత
  6. గ.గరళించె
  7. గ.నొరుసొమ్ములం
  8. క.నల్గి
  9. గ.యన్యోపదేశంబు
  10. క.రదిమి, గ.రదశి
  11. క.మందుకొనుట